శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ అవార్డు...
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ అవార్డు : శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ అవార్డు లభించింది. ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను శంషాబాద్‌లోని జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ అవార్డు దక్కింది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) వార్షిక అవార్డుల్లో భాగంగా ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ఏఎస్‌క్యూ) విభాగంలో 2023 ఏడాదికి గాను ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో హైదరాబాద్ ఉత్తమ విమానాశ్రయంగా నిలిచిందని జీఎంఆర్ సంస్థ నిర్వాహాకులు తెలిపారు.
ఈ విమానశ్రయం సంవత్సరానికి 1.5 నుంచి 2.5 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించడం జరుగుతుంది. ప్రపంచంలోని 400 విమానాశ్రయాలు ఈ అవార్డు కోసం పోటీ పడగా, 30కి పైగా పనితీరు సూచికల ఆధారంగా అంతిమ విజేతగా శంషాబాద్ విమానశ్రయాన్ని నిర్ణయించారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఏసిఐ పురస్కారం లభించడం పట్ల జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈఓ ప్రదీప్ పణికర్ మాట్లాడారు. శంషాబాద్ విమానశ్రయ నిర్వహణలో భాగమైన అందరికీ ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ఇక, ఈ విమానశ్రయ విస్తరణ ప్రణాళికలో భాగంగా టెర్మినల్, ఎయిర్‌సైడ్ ప్రాంతాల్లో కొత్త సౌకర్యాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

పక్షి ఆకారంలో ఉన్న రన్‌వే : శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరికొద్ది రోజుల్లో పదహారో ఏటా పూర్తి చేసుకోబోతోంది. దక్షిణ భారతదేశంలో విమాన ప్రయాణాలకు ఈ ఎయిర్‌పోర్ట్ కేంద్రబిందువుగా మారనుంది. ఇక్కడి నుంచి దేశీయ, విదేశీ విమానాల రాకపోకలు పెరగడంతో అందుకు తగ్గట్టుగానే రన్‌వే విస్తరణ పనులను ఎయిర్‌పోర్ట్ ప్రాధికార సంస్థ చేపట్టింది. ఈ విమానాశ్రయంలోని రన్ వే పక్షి ఆకారంలో ఉంటుంది. ఈ రన్‌వే మొత్తం 4,260 మీటర్లు ఉంటుంది.
గత కొన్ని మాసాలుగా ఎయిర్‌పోర్టు తూర్పు, పడమర వైపు 3,707 మీటర్ల రన్‌వే నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ రెండు రన్‌వేలు ఒకట్రెండు నెలల్లో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ విమానశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్నవారి సంఖ్య ప్రతి సంవత్సరం 20 శాతానికి పైగా పెరుగుతూనే ఉంది. 2023 డిసెంబరులో ఒకే రోజు 536 విమానాలు రాకపోకలు కొనసాగించాయి. గత సంవత్సరం ఒక నెలకు సగటున 20 లక్షల మంది ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించారు. 2025 జనవరిలోపు ఈ సంఖ్య 22 లక్షలకు చేరొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications