అంతర్జాతీయ సదస్సులకు కేటీఆర్‌కు ఆహ్వానం, స్టాన్‌ఫోర్డ్ నుంచి కూడా

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు అంతర్జాతీయ సదస్సులకు ఆహ్వానం అందింది. ఆయనకు రెండు సదస్సులకు ఆహ్వానం వచ్చింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు అంతర్జాతీయ సదస్సులకు ఆహ్వానం అందింది. ఆయనకు రెండు సదస్సులకు ఆహ్వానం వచ్చింది.

ప్రపంచ పర్యావరణ, నీటివనరుల కాంగ్రెస్‌కు హాజరుకావాలని అమెరికా ఇంజినీర్ల సంఘం ఆహ్వానించింది. మే 21 నుంచి 26 వరకు ఈ సదస్సు జరగనుంది.

kt rama rao

అయితే, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథపై ఆసక్తి కనబర్చిన ఈ కాంగ్రెస్‌ సదస్సులో ప్రారంభోపన్యాసం చేయాలని కేటీఆర్‌ను కోరింది.

అలాగే, ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి కూడా కేటీఆర్‌కు మరో ఆహ్వానం అందింది. మే 18, 19 తేదీల్లో సదస్సులో ప్రసంగించాలని ఆయనకు ఆహ్వానం వచ్చింది. తనకు ఆహ్వానం అందడం పట్ల కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. ఈ రెండు ఆహ్వానాలు మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ కార్యక్రమాలకు వచ్చిన గుర్తింపుగా ఆయన వర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+