తెలుగు అక్షరంతో తలెత్తిన 'బగ్' తొలగించారు, అందుబాటులో యాపిల్ అప్‌డేటెడ్ వెర్షన్!
హైదరాబాద్: ఇటీవల ఫేస్‌బుక్‌లో చాలామందిని ఓ విచిత్రమైన సమస్య వెంటాడింది. చాలామంది తెలుగులో రాసిన పోస్టులు స్పామ్ అంటూ రిపోర్ట్ చేయబడ్డాయి. కొన్ని పాత పోస్టులు కూడా ఎగిరిపోయాయి. దీనంతటికి కారణం 'జ్ఞ' అనే అక్షరమే.
యాపిల్ ఐఓఎస్‌లో తెలుగు యూనీకోడ్‌కి చెందిన 'జ్ఞ' అనే అక్షరాన్ని రెండర్ చేసి స్క్రీన్‌పై సక్రమంగా చూపించలేక.. చాలా పోస్టులు క్రాష్ అయిపోయాయి. దీంతో అసలు ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందో తెలియక చాలామంది సతమతమయ్యారు.

ఈ నేపథ్యంలో ఎట్టకేలకు తెలుగు పదంతో వచ్చిన సమస్యను పరిష్కరించింది. 'జ్ఞ' అనే అక్షరం టైప్ చేసినప్పుడు అప్లికేషన్స్ క్రాష్ అయిపోతుండటంతో.. దీన్నో బగ్‌గా గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించి మెరుగైన ఐవోఎస్ 11.2.6 వెర్షన్, టీవీ ఓఎస్ 11.2.6, వాచ్ ఓఎస్ 4.2.3, మ్యాక్ ఓఎస్ 10.13.3 వెర్షన్లను యాపిల్ విడుదల చేసింది.
కాగా, ఒక్క ఫేస్ బుక్ మాత్రమే గాక , జీమెయిల్, ట్విట్టర్ సహా ప్రీ ఇన్ స్టాల్డ్ మెస్సేజింగ్ యాప్ లన్ని ఈ పదం టైప్ చేయగానే బ్లాక్ అవడం జరిగాయి. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు యాపిల్ ఆ బగ్ తొలగించింది. యూజర్స్ కొత్త వెర్షన్ ఇన్ స్టాల్ చేసుకుంటే ఆ బగ్ సమస్య తలెత్తదు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications