సీపీగా సీవీ ఆనంద్ నియామకం వెనుక - బిగ్ టాస్క్..!!
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. సీపీగా ఆయన బాధ్యతలు చేపట్టడం రెండోసారి. బాధ్యతల స్వీకరణ సమయంలోనే తన లక్ష్యాలను స్పష్టం చేసారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పైన స్పందించారు. నేరస్తులతో గట్టిగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే, నూతన సీపీగా ఆనంద్ ఎంపిక వెనుక భారీ కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. నూతన సీపీగా ఆనంద్ కు ప్రభుత్వం బిగ్ టాస్క్ అప్పగించింది.
బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ ను మరింత మెరుగు పరుస్తామని నూతన సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేసారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఒక భాగమని పేర్కొన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని చెప్పారు. వినాయక నిమజ్జనం అనేది హైదరాబాద్‌లో కీలకమన్నారు. వినాయక నిమజ్జనం అనేది ప్రశాంతంగా అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది తాను ఇంకా ఫైల్ చూడలేదని సీవీ ఆనంద్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఒక్కసారి సమీక్ష నిర్వయిస్తామన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ వ్యవస్థ పైన ఫోకస్ చేస్తామన్నారు.

రెండో సారి సీపీగా
హత్యలు, అత్యాచారాలు , లా అండ్ ఆర్డర్‌పై కఠినంగా వ్యవహరిస్తామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. 2021 డిసెంబర్ నుంచి 2023 అక్టోబర్ వరకూ హైదరాబాద్ సీపీగా పని చేశారు. తెలంగాణ కేడర్‌కు చెందిన సీవీ ఆనంద్.. 2017లో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పదోన్నతి ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లారు. అనంతరం 2021లో తిరిగి తెలంగాణకు చేరుకున్నారు. ఆయనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్టులో డీజీపీ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023 ఎన్నికల సమయంలో ఆయనను సీపీ పదవి నుంచి తప్పించారు.
ప్రభుత్వం ఏరికోరి
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆనంద్‌కు ఏసీబీ డీజీగా బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం తిరిగి హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. తొలిసారిగా 2021లో హైదరాబాద్ సీపీగా నియమితులయ్యారు. ఆ ఏడాది డిసెంబర్ 25 నుంచి గతేడాది అక్టోబర్ 12 వరకు విధులు నిర్వర్తించారు. అయితే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆ మరుసటి రోజు బదిలీ అయ్యారు. నగర పరిధిలో కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు..భవిష్యత్ లక్షాల కోసం ప్రభుత్వం ఏరి కోరి తొలి సారిగా డీజీపీ స్థాయి అధికారి ఆనంద్ ను తిరిగి సీపీగా నియమించింది.












Click it and Unblock the Notifications