ఐపీఎస్ అధికారి భార్య ఆత్మహత్య
తెలంగాణ పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తోన్న శివప్రసాద్ భార్య ఉషారాణి(52) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తోన్న శివప్రసాద్ భార్య ఉషారాణి(52) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ ప్రకాశ్‌నగర్‌లోని తమ నివాసంలోనే సీలింగ్ ఫ్యాన్ కు ఆమె ఉరి వేసుకున్నారు.
ఇది గమనించిన కుటుంబసభ్యులు సాయంత్రం 5 గంటల సమయంలో ఆమెను కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఉషారాణి పదకొండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రిలో శవ పరీక్ష నిర్వహించిన అనంతరం ఉషారాణి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఉషారాణి భర్త శివప్రసాద్ హైదరాబాద్‌లో సీఏఆర్ అడిషనల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. భార్య మృతితో విషాదంలో కూరుకుపోయిన ఆయన్ని పలువురు నేతలు, అధికారులు ఓదార్చారు.












Click it and Unblock the Notifications