డీజీపీని అంత మాట అంటారా?: స్పీకర్‌కు రఘునందన్ రావుపై ఐపీఎస్ అధికారుల సంఘం
హైదరాబాద్: దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్ అయ్యింది. డీజీపీ అంజనీ కుమార్‌పై దారుణ పదజాలం ఉపయోగించారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో బీహార్ రాజ్యాంగాన్ని డీజీపీ అంజనీ కుమార్ అమలు చేస్తున్నారని రఘునందన్ వ్యాఖ్యానించడంపై ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేశారంటూ రఘునందన్ పై ఐపీఎస్ అధికారుల సంఘం మండిపడింది. వెంటనే ఆయనపై క్రమశిక్షణా చర్యలు కోరుతూ అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన మాటలు పోలీసు వ్యవస్థ నైతికతనే దెబ్బతీస్తున్నాయని ధ్వజమెత్తింది.

అరెస్టులో నిబంధనలు పాటించకుంటే అధికారులను ప్రశ్నించ్చనీ.. కోర్టును ఆశ్రయించ్చనీ.. కానీ, ఆటవిక భాషను ఉపయోగించి అత్యున్నత పదవి అయిన డీజీపీని అవమానకరంగా దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. తెలంగాణ శాంతిభద్రతలను కాపాడటంలో దేశంలో ప్రథమస్థానంలో ఉందని.. తమ రాజకీయ ప్రయోజనాల కోసం చట్టసభసభ్యుడిగా ఉండి.. పోలీసు వ్యవస్థ అధిపతిని ఉద్దేశించి వ్యక్తిగత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు రఘునందన్ పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఐపీఎస్ అధికారుల సంఘం విజ్ఞప్తి చేసింది.
కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పరామర్శించడానికి వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరామర్శించడానికి వచ్చిన వాళ్లను అరెస్ట్ చేయడం ఏంటని, తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని రఘునందన్ రావు.. పోలీసులను ప్రశ్నించారు. రఘునందన్ రావుతో పాటు మరికొందరు మహిళా బేజేపీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ ముందు మరింత ఉద్రిక్త పరిస్థులు నెలకొంది. పోలీసులు రఘునందన్ రావు పట్ల దురుసుగా ప్రవర్తించారని బీజేపీ నేతలు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications