రైలు ప్రయాణీకులకు అలర్ట్ - టికెట్ బుకింగ్ లో మార్పులు..కొత్తగా..!!

రైల్వే టికెట్ బుకింగ్ కోసం కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది.

రైల్వే ప్రయాణీకులకు మరో కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. రైల్వే ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సేవలు ప్రస్తుతం ఐఆర్‎సీటీసీ ద్వారా అందుబాటులో ఉన్నాయి. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు ఉన్నా.. ఎక్కవ శాతం ప్రయాణీకులు ఐఆర్‎సీటీసీ వెబ్ సైట్ ద్వారానే టికెట్ బుకింగ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. తత్కాల్.. రద్దీ సమయాల్లో ఈ వెబ్ సైట్ ద్వారా టికెట్ బుకింగ్ లో సమస్యలు ఏర్పడుతున్నాయి. పెరుగుతున్న డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని రైల్వే బుకింగ్ సేవల్లో కొత్త సదుపాయాలను ఐఆర్‎సీటీసీ అందుబాటులోకి తీసుకొస్తోంది.

వాయిస్ ఈటికెటింగ్ వ్యూచర్

వాయిస్ ఈటికెటింగ్ వ్యూచర్

ఐఆర్‎సీటీసీ త్వరలో ఆర్టిఫిషయల్ ఇంటలిజెంట్స్ బెస్ టూ వాయిస్ ఈటికెటింగ్ వ్యూచర్‎ను ప్రవేశ పెట్టనుంది. ఆర్టిఫిషయల్ ఇంటలిజెంట్స్ ఆధారిత చాట్ బాట్ వ్యూచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత కొత్త విధానంలో టికెట్ బుకింగ్ కు అవకాశం కలుగుతుంది. అందులో భాగంగా ఇక నుంచి ఐఆర్‎సీటీసీ లాగిన్ కావడానికి ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానం అవసరం ఉండదు. ప్రయాణీకుడి ఐడీ, పాస్ వర్డ్, ఓటీపీల తో అవసరం లేకుండా కొత్త విధానంలో టికెట్ పొందే వెసులుబాటు కలుగుతుంది. ఇందులో కేవలం వాయిస్ ద్వారా రైలు టికెట్స్‎ను బుక్ చేసుకోనే అవకాశం ఏర్పడుతుంది. ఈ ఫీచర్ వినియోగం సమయంలో టికెట్ బుక్ చేసుకొనే ప్రయాణీకుడు హిందీ లేదా ఇంగ్లీషు భాషలో సమాచారం పొందే వెసులుబాటు ఉంటుంది. సమాధానాలు లభిస్తాయి.
పైలెట్ ప్రాజెక్టు కింద పరిశీలన

పైలెట్ ప్రాజెక్టు కింద పరిశీలన


ఈ ఫీచర్ లో టికెట్ బుకింగ్ తో పాటుగా టికెట్ రద్దు అవకాశం కూడా ఉంటుంది. టికెట్ డబ్బులు తిరిగి ప్రయాణీకుడి ఖాతాలో చేరే వరకూ స్టేటస్ ను రైల్వే టికెట్ పీఎన్ఆర్ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకొనే వెసులుబాటు ఉంది. సాధారణ టికెట్ బుకింగ్ సమయంలో ఉండే అన్ని ఆప్షన్లు ఇందులో ఉంటాయి. ఫీచర్ లో మాత్రమే మార్పు ఉంటుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ విధానం అమలుకు నిర్ణయించారు. ఇప్పుడు ఆచరణలోకి తీసుకొచ్చే విధంగా నిర్ణయించారు. దీని కోసం కొన్ని అవసరమైన మార్పులతో డిజిటల్ ఇంటరాక్షన్ టూ సీటు హెల్ప్ ఎనీ టైమ్పరీక్షిస్తోంది. తొలి దశ పరీక్షలో విజయవంతం కావడంతో.. మలిదశ టెస్టింగ్‎ను మరింత వేగవంతం చేయనుంది.

ఆర్టిఫిషయల్ ఇంటలిజెంట్స్ ఆధారిత సేవలు

ఆర్టిఫిషయల్ ఇంటలిజెంట్స్ ఆధారిత సేవలు


దీని పైన అన్ని స్థాయిలో టెస్టింగ్ పూర్తయిన తరువాత ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఐఆర్‎సీటీసీ భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఐఆర్‎సీటీసీ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసింది. ప్రయాణీకుల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరిస్తోంది. అదే సమయంలో ఈ విధానం ద్వారా అదనపు ఛార్జీల భారం లేకుండా చూడాలనే సూచనలు అందుతున్నాయి. దీని కోసం సాంకేతికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఎక్కడా అంతరాయం లేని సేవలు అందించే విధంగా ఈ ఫీచర్ కు తుది రూపు ఇస్తున్నారు. త్వరలోనే దీనిని ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోందని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+