గండం గట్టెక్కిస్తారా?: బాబు రేవంత్ వైపా!, సీనియర్ల వైపా!.. అదే జరిగితే?

తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీరు ఆ పార్టీకి తలనొప్పిగా తయారైంది. కాంగ్రెస్ లోకి వెళ్లడానికి సర్వం సిద్దం చేసుకున్న ఆయన.. ఉన్నట్టుండి యూటర్న్ తీసుకోవడం వారికి అంతుచిక్కడం లేదు

Recommended Video

    Revanth Reddy VS TDP senior leaders బాబు రేవంత్ వైపా!, సీనియర్ల వైపా! అదే జరిగితే? | Oneindia Telugu

    హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీరు ఆ పార్టీకి తలనొప్పిగా తయారైంది. కాంగ్రెస్ లోకి వెళ్లడానికి సర్వం సిద్దం చేసుకున్న ఆయన.. ఉన్నట్టుండి యూటర్న్ తీసుకోవడం వారికి అంతుచిక్కడం లేదు.

    తాత్కాళికంగా రేవంత్ పార్టీ మార్పుపై వెనక్కి తగ్గినా.. ఎప్పటికైనా ఆయన పార్టీని వీడుతారనే భావం వారిలో బలంగా నాటుకుపోయింది. పోతూ.. పోతూ.. తన వెంటపెట్టుకెళ్లడానికి ఓ గ్రూపును కూడా సిద్దం చేసుకున్నట్టే కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే దెబ్బతిన్న తెలంగాణ టీడీపీని రేవంత్ నిండా ముంచుతాడేమోనన్న భయంలో ఆ పార్టీ సీనియర్లు ఉన్నారు.

     మొక్కుబడిగా చెప్తే ఎలా?

    మొక్కుబడిగా చెప్తే ఎలా?

    ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రేవంత్ యూటర్న్ పై స్పందించారు. కాంగ్రెస్ లోకి వెళ్లడం లేదన్న విషయాన్ని రేవంత్ ఏదో మొక్కుబడిగా చెప్పారని, పార్టీ మారడం లేదని గట్టిగా చెప్పలేదని విమర్శించారు.

    తూతూ మంత్రంగా పార్టీ మారట్లేదని చెప్పితే సరిపోదని, కార్యకర్తల్లో జరుగుతోన్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత రేవంత్ పై ఉందని గుర్తుచేశారు. విదేశీ పర్యటనలో ఉన్న తమ అధినేత చంద్రబాబుకు అంతా వివరించామని, ఆయన వచ్చాక అన్ని విషయాలు పరిశీలిస్తారని అన్నారు. అటు రేవంత్ సైతం చంద్రబాబుతోనే అన్ని వివరిస్తానని చెప్పడం కూడా తెలిసిన విషయమే.

     బాబు మోసపోయారు

    బాబు మోసపోయారు

    రేవంత్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చి పార్టీకి కావాల్సినంత డ్యామేజ్ చేశారని సీనియర్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రేవంత్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 22శాతం ఉన్న తమ ఓటు బ్యాంకు 7శాతానికి పడిపోయిందని పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఆరోపిస్తున్నారు. ఒకవిధంగా రేవంత్‌ను నమ్మి చంద్రబాబు మోసపోయారని, ఇంకా నమ్మితే మరింత మోసపోక తప్పదని విమర్శిస్తున్నారు.

    వెనకేసుకొస్తారా? మందలిస్తారా?

    వెనకేసుకొస్తారా? మందలిస్తారా?

    ప్రస్తుతం పార్టీలో సీనియర్లంతా ఒకవైపు.. రేవంత్ ఒకవైపు ఉన్న పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ వ్యవహారంపై తమకు కనీస వివరణ కూడా ఇవ్వడానికి రేవంత్ సిద్దంగా లేకపోవడం వారికి మింగుడుపడటం లేదు. తొలి నుంచి రేవంత్‌ను చంద్రబాబు కట్టడి చేయకపోవడం వల్లే తమకీ పరిస్థితి వచ్చిందని వారు భావిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ఆయన్ను మందలిస్తే తప్ప వారి ఆగ్రహం చల్లారదు.

    అదే జరిగితే..,గండాన్ని గట్టెక్కిస్తారా?.

    అదే జరిగితే..,గండాన్ని గట్టెక్కిస్తారా?.

    ఒకవేళ చంద్రబాబు ఎప్పటిలాగే రేవంత్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తే.. సీనియర్ల అహం మరింత దెబ్బతినవచ్చు. అదే జరిగితే.. రేవంత్ పోకడలకు పార్టీలో ఇక పగ్గాలు వేసేవారే ఉండరు. ఈ పోకడలు పార్టీలో కొనసాగడంపై సీనియర్లను అంతర్మథనంలో పడేయవచ్చు.

    ఆవిధంగా రేవంత్ పెట్టిన చిచ్చు.. ఎటొచ్చి టీడీపీకి పెద్ద గండాన్నే సృష్టించిందని చెప్పాలి. పార్టీ మారట్లేదని ఇప్పుడాయన చెప్పినంత మాత్రాన.. సీనియర్లలో ఆయన పట్ల అనుమానం తొలగిపోతుందనుకోవడం భ్రమే. కాబట్టి ఈ గండాన్ని గట్టెక్కించి తిరిగి పార్టీని చంద్రబాబు ఎలా పట్టాలెక్కిస్తారనే దానిపైనై టీటీడీపీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+