ఇక నుంచి రైలులో తిరుపతి వెళ్లాలంటే చాలా కష్టం?
ఏడుకొండలపై కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకేటశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు 90 శాతం భక్తులు దేశవ్యాప్తంగా రైళ్లద్వారానే ఇక్కడకు చేరుకుంటారు. కొన్ని రైళ్లు రేణిగుంటకు, మరికొన్ని నేరుగా తిరుపతి స్టేషన్ కు చేరుకుంటాయి. అయినప్పటికీ తిరుపతి రైల్వేస్టేషన్ పై అధిక భారం పడుతోంది. ప్రస్తుతం ఈ స్టేషన్ ను ఆధునికీకరిస్తున్నారు. ఒత్తిడి తగ్గించేందుకు తిరుపతికి సమీపంలోని తిరుచానూరు రైల్వేస్టేషన్ ను అందుబాటులోకి తెచ్చారు.
దాదాపు రూ.120 కోట్లతో ఈ స్టేషన్ ను అభివృద్ధి చేశారు. ప్రతిరోజు 80 వేల నుంచి 90 వేల మంది ప్రయాణికులు తిరుపతి స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారంటే ఈ స్టేషన్ పై ఎంత ఒత్తిడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రత్యామ్నాయంగా తిరుచానూరును అధికారులు అభివృద్ధి చేశారు.

కొన్ని రైళ్లు ఇక్కడి వరకే నడవడంతోపాటు, ఇక్కడి నుంచే ప్రారంభమవుతున్నాయి. అంటే చర్లపల్లి రైల్వేస్టేషన్ లా అన్నమాట. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఆరు రైళ్లు నడుపుతున్నారు.
07252 చర్లపల్లి - తిరుచానూరు
తిరుచానూరు - చర్లపల్లి
07018 చర్లపల్లి - తిరుచానూరు
తిరుచానూరు - చర్లపల్లి
07010 సికింద్రాబాద్ - తిరుచానూరు
తిరుచానూరు - సికింద్రాబాద్
07610 జాల్నా - తిరుచానూరు
తిరుచానూరు - జాల్నా
07016 నాందేడ్ - తిరుచానూరు
తిరుచానూరు - నాందేడ్
66070 చెన్నై సెంట్రల్ - తిరుచానూరు
తిరుచానూరు - చెన్నై సెంట్రల్
66044 అరక్కోణం - తిరుచానూరు
తిరుచానూరు - అరక్కోణం
ఈ రైళ్లన్నీ ఇక నుంచి తిరుచానూరు నుంచే నడవనున్నాయి. సికింద్రాబాద్ నుంచి, లింగంపల్లి నుంచి చాలా రైళ్లు చర్లపల్లికి మార్చారు. దీనివల్ల ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పుడు తిరుపతి కాకుండా తిరుచానూరుకు కొన్ని రైళ్లు మార్చారు. భవిష్యత్తులో మరిన్ని రైళ్లను కచ్చితంగా ఇక్కడినుంచే నడపబోతున్నారు. దీంతో ప్రయాణికులు తిరుచానూరు నుంచి ఇబ్బంది పడుతూ తిరుపతికి రావాల్సి ఉంటుంది. ఇబ్బంది పడుతూ వెళ్లేటప్పుడు కూడా తిరుచానూరు స్టేషన్ కు చేరుకోవాల్సి ఉంటుంది.
కొన్ని ప్యాసింజర్ రైళ్లను కూడా తిరుచానూరు నుంచి ప్రారంభించబోతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి, వెళ్లే రైళ్లు హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి ప్రధాన స్టేషన్ల నుంచి చర్లపల్లికి ఎలా మార్చారో.. దూర ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే రైళ్లను కూడా అలాగే తిరుచానూరుకు మార్చే అవకాశం ఉంది. తిరుచానూరు నుంచి తిరుపతికి వచ్చే అవసరం లేకుండా నేరుగా అక్కడి నుంచే తిరుమల వెళ్లిపోవచ్చు. అలాగే తిరుమల నుంచి తిరుచానూరుకు వెళ్లిపోవచ్చు.












Click it and Unblock the Notifications