కేసీఆర్ మాటలకు రగిలిన ఆవేదన: అవును చిల్లరగాళ్లమే.. దీనికి జవాబుందా?

సోషల్ మీడియాలో విమర్శలకు సంయమనం కోల్పోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

హైదరాబాద్: సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఓ గౌరవనీయ స్థానంలో ఉన్న ప్రొఫెసర్‌ను వాడూ.. వీడూ.. అంటూ మాట్లాడటం ఏం సంస్కృతి?. కేసీఆర్ చెప్పినట్లు ఉద్యమంలో కోదండరాం గురించిన వాస్తవాలు వేరేలా ఉండవచ్చు. అదే నిజమైతే కేసీఆర్ ఆ విషయాల్ని హుందా గానే చెప్పి ఉండవచ్చు కదా.

వీధి పంచాయితీలో మాట్లాడే భాషను ఉపయోగించి.. కోదండరాంను బజారుకీడ్చానని కేసీఆర్ భావిస్తున్నారు తప్పా.. దీనివల్ల పూర్తిగా దెబ్బతిన్నది కేసీఆర్ ఇమేజే. ఒకరకంగా ఆయన అభిమానులకూ కేసీఆర్ వ్యాఖ్యలు రుచించట్లేదన్నది వాస్తవం. అభద్రతా భావం నుంచే కేసీఆర్ అంత అసహనానికి లోనైనట్లుగా కనిపిస్తోంది.

Is KCR Getting Frustrated With Criticism?

సింగరేణి ఎన్నికల్లో విజయం ఆత్మవిశ్వాసానికి బదులు అతివిశ్వాసాన్నే నింపినట్లుంది. ప్రజలు ప్రతీది గమనిస్తున్నారన్న స్పృహ లేకపోతే.. కేసీఆర్ తనకు తాను వ్యతిరేకతను కొనితెచ్చుకున్నవారవుతారు.

ఎన్నికల రాజకీయంలో ఏదైనా జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు 'మిడిసిపాటు' అని భవిష్యత్తులో జనం అనుకునే పరిస్థితి రావద్దంటే ఆయనెంత హుందాగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. అలా కాకుండా ఇష్టారీతిన నోరు పారేసుకుంటూ పోతాననుకుంటే.. ఆయన వ్యతిరేకులు పిలిచిన 'హిట్లర్' పిలుపే జనం నుంచి కూడా వినాల్సి వస్తుందేమో!

ఇక సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై కూడా కేసీఆర్ తీవ్రంగానే స్పందించారు. ఆ విమర్శల తాకిడి ఫ్రస్టేషన్ ఆయన వ్యాఖ్యల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం ఎన్నో తిట్లు తిన్నా.. అని చెప్పుకునే సీఎం సోషల్ మీడియాలో విమర్శలకు సంయమనం కోల్పోవడం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది.

కేసీఆర్ 'చిల్లరగాళ్లు' అంటూ సోషల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలు నిజమైన ఉద్యమకారులను ఎంతగా రగిలేలా చేశాయో ప్రతాప్ రెడ్డి గంగారం అనే వ్యక్తి ఆవేదనన చూస్తే అర్థమవుతుంది.

Is KCR Getting Frustrated With Criticism?

అవును మేము చిల్లర గాళ్లమె..

మన తెలంగాణా మన ఉద్యోగాలు మన నీళ్లు అని ఉపన్యాసాలు ఇస్తుంటె అవి నిజమని నమ్మిన చిల్లర గాళ్లం.

ఇంట్లొ అడుక్కు తినె పరిష్థితులు ఉన్నా ఉద్యమ సమయంలొ మీరు మాకు ఇచ్చె భరోసా కోసం మీరు ఎక్కడ సభలు పెడితె అక్కడికి పని పాట వదిలేసి వచ్చి మీకు అండగా నిలిచిన చిల్లర గాళ్లం.

మా పాటికి మేము చదువుకుంటుంటె మీరు పిలిచిన ప్రతిసారి మీరు కోరుకున్న చోటుకి వచ్చి ఉద్యమంలొ లాటి దెబ్బలు తిన్న చిల్లర గాళ్లం.

మీరు కేసిఆర్ చచ్చుడో తెలంగాణా వచ్చుడో అని నినదించినప్పుడు మావోడు చచ్చుడేంది అని అమ్మా నాన్న కటిక పేదరికంలొ ఉన్న వాళ్ల బాధ్యత మా మీద ఉన్నా మీకు బదులుగా ఆత్మ బలిదానాలు చేసుకున్న చిళ్లర గాళ్లం.

తిండి నిద్ర వదిలేసి ఇదే సోషల్ మీడియా సాక్షిగా తెలంగాణా ఉద్యమాన్ని వ్యాప్తి చేస్తు ప్రజలను సమీకరించిన చిళ్లర గాళ్లం.

సోషల్ మీడియాలొ ఆంధ్ర ప్రజలు అమ్మ నా భూతులు తిడుతున్నా పడుతు ఆంధ్రా ప్రజలకు ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర అవశ్యకతను వివరించిన చిళ్లర గాళ్లం.

ఆ అయిదేళ్ల కాలం ఒక వైపు చదుకుంటు ఒక వైపు ఉద్యమాలు చేస్తు తెలంగాణా వస్తే కొలువులు ఇస్తామని మీరు పదే పదే మా చెవులు తూట్లు పడేలా మాకు ఆశలు కలిపిస్తె అవి నమ్మి అప్పటి ప్రభుత్వాల చేతిలొ మా శరీరాల్ని చిధ్రం చేసుకున్న చిళ్లర గాళ్లం.

తెలంగాణా వచ్చాక మీరు ఉద్యోగ నియమకాల మీద నెలకొ ప్రకటన చేస్తుంటె అవి నమ్మి చేస్తున్న పనులు వదిలేసి ఇమ్ట్లొ గతి లేకున్నా అప్పులు తెచుకుని చదువుల మీద పడి ఇంకా అప్పుల పాలై తల్లి దండ్రులకు మానసిక క్షోబను మిగిల్చిన చిళ్లర గాళ్లం.

మమ్మల్ని ఆంధ్ర స్నేహితులకు దూరం చేసి మీరు మాత్రం మీ ఆంధ్రా స్నేహితులకు దగ్గరైన అవి చూసి బరిస్తున్న చిళ్లర గాళ్లం.

మీతొ ఒకప్పుడు కలిసి రాని తెలంగాణా ద్రోహులు నేడు మీకు భజనలు చేస్తే వాళ్లు మీకు తెలంగాణా వాదులయ్యారు. 14 ఏళ్లు మీకు అండగా నిలిచి ఇప్పుడు మీ ప్రభుత్వ విదానాలలొ లోపం ఉందని విమర్శించె మేము చిళ్లర గాళ్లం అయ్యాం.
వహ్ శబ్బాష్..

-ప్రతాప్ రెడ్డి గంగారం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+