Shanmukh Jaswanth: ఫ్యాన్ బేస్ ఉన్నా అట్టర్‌ఫ్లాప్: సిరితో రొమాన్స్ కొంపముంచిందా?
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5.. కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ ఫినాలె కళ్లు చెదిరేలా మొదలైంది. ఈ సీజన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుని ఫెయిల్ అయిన కంటెస్టెంట్లు తమ ఆటపాటలతో మోతెక్కించారు. వంద ఎపిసోడ్లకు పైగా సాగిన ఈ సీజన్ ఇంకొన్ని గంటల్లో ఓ కొత్త బిగ్‌బాస్ విన్నర్‌ను అందించనుంది.

కంటెస్టెంట్లందరూ ఒకే వేదికపై
సరయు, ఉమాదేవి, లహరి షారీ, నటరాజ్ మాస్టర్, హమీదా ఖాతూన్, శ్వేతా వర్మ, ప్రియ, లోబో, విశ్వ, జెస్సీ అలియాస్ జస్వంత్ పడాల, యానీ మాస్టర్, యాంకర్ రవి, ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ, ఆర్జే కాజల్.. స్టెప్స్‌తో అదరగొట్టారు. విన్నర్ గురించి అక్కినేని నాగార్జున అడిగిన ప్రశ్నలకు తమకు తోచిన విధంగా సమాధానాలిచ్చారు. మెజారిటీ మాజీ కంటెస్టెంట్లు వీజే సన్నీ, శ్రీరామచంద్ర పేర్లనే ప్రస్తావించారు. వీరిలో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారనేది ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది.

వీజే సన్నీపైనే ఫోకస్..
ప్రస్తుతం సోషల్ మీడియా ఫోకస్ మొత్తం అంతా కూడా వీజే సన్నీ మీదే ఉంది. అతనే ఈ సీజన్ హీరోగా ఆవిర్భవిస్తాడనే అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణాలను కూడా వివరిస్తోన్నారు వ్యూవర్స్. సన్నీ పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ టైటిల్ కోసం పోటీ పడుతోన్న అయిదు మందిలో ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది విషయంపైనా క్లారిటీ వచ్చేసింది. ఎవరి పొజీషన్ ఏమిటనే విషయంపై స్పష్టత వచ్చేసింది.

షణ్ముఖ్ పరిస్థితేంటీ..?
నిజానికి యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ ఈ సీజన్ విజేతగా నిలుస్తాడంటూ మొదట్లో అంచనాలు వ్యక్తమయ్యాయి. చాలామంది అతని వైపే మొగ్గు చూపారు. స్టార్ యూట్యూబర్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి రాకముందు నుంచే అతని పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. హ్యూజ్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. వారందరి సపోర్ట్‌తోనే షణ్ముఖ్.. టాప్ 5 దాకా రాగలిగాడనటంలో సందేహాలు అక్కర్లేదు. అతను ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన ప్రతీసారి.. అభిమానుల ఓట్లతోనే ఒడ్డున పడ్డాడు.

సిరితో లవ్ ట్రాక్..
ఇన్ని భారీ అంచనాల మధ్య బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగుతూ వచ్చిన షణ్ముఖ్ జశ్వంత్.. ఎప్పుడైతే సిరి హన్మంత్‌తో ఫ్రెండ్‌షిప్ మొదలు పెట్టాడో.. అక్కడి నుంచి ట్రాక్ తప్పినట్టే కనిపించింది. సిరి-షన్ను మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందనే టాపిక్.. సోషల్ మీడియాలో మంటలు రేపింది. హాట్ డిబేట్‌కు దారి తీసింది. ఈ అనుమానాలను మరింత బలం చేకూర్చేలా వారి ప్రవర్తన కూడా కనిపించింది హౌస్‌లో. మాజీ కంటెస్టెంట్ జెస్సీ సైతం వారిద్దరికీ ఇదే ప్రశ్నను సంధించిన విషయం తెలిసిందే. నాగార్జున కూడా దాని గురించి ప్రశ్నించాడు. తమ మధ్య ఉన్నది ఫ్రెండ్‌షిప్ మాత్రమేనని తేల్చేశాడు షన్ను.

దీప్తి సునయన జోక్యం..
ఒకదశలో షన్ను లవర్ దీప్తి సునయన సైతం ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. షణ్ముఖ్ జశ్వంత్ వ్యక్తిత్వం గురించి తుది నిర్ణయం తీసుకోవద్దంటూ విజ్ఞప్తి చేశారు. బిగ్‌బాస్ హౌస్‌లో అతని ప్రవర్తనను చూసి.. వ్యక్తితాన్ని అంచనా వేయొద్దని కోరారు. ఇది ఓ షో మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, తన ఇష్టప్రకారమే అతను బిగ్‌బాస్ హౌస్‌లో గేమ్ ఆడుతున్నాడని అన్నారు. తాను షన్నుకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నానని దీప్తి సునయన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పష్టం చేశారు.

అప్పటికే చేతులు దాటిందా..
దీప్తి సునయన జోక్యం చేసుకునేటప్పటికే పరిస్థిితి చేయి దాటినట్టు కనిపించింది. జరగాల్సిన నష్టం జరిగిపోయినట్టే అయింది. షన్ను స్థానంలో వీజే సన్నీ, శ్రీరామచంద్ర దూసుకొచ్చేశారు. షన్ను కొంత కన్‌ఫ్యూజన్‌లో ఉండటం కొన్ని ఎపిసోడ్లల్లో స్పష్టంగా కనిపించింది. అతన్ని డామినేట్ చేసేలా వ్యవహరించారు సన్నీ, శ్రీరామచంద్ర. మరో ఛాన్స్ షన్నుకు ఇవ్వలేదు. అప్పటికే ఈ సీజన్ కూడా ముగింపుదశకు వచ్చేయడంతో షన్ను పుంజుకోలేకపోయాడు.












Click it and Unblock the Notifications