నవంబర్‌లో బ్యాంకులకు 17 రోజులు సెలవులు: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని రోజులంటే?

హైదరాబాద్: నవంబర్ నెలలో దాదాపు సగం కంటే ఎక్కువ రోజులు బ్యాంకులకు సెలవు దినాలు ఉండటం గమనార్హం. ఆర్బీఐ ప్రకటించిన జాబితా ప్రకారం ముఖ్యమైన పండగలు, సాధారణ సెలువులు కలుపుకుని మొత్తం 17 రోజులు బ్యాంకులు పనిచేయవు. ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

అయితే, ఈ 17 రోజుల సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవడం గమనార్హం. రాష్ట్రాలను బట్టి సెలవు దినాలు మారుతూ ఉంటాయి. కన్నడ రాజ్యోత్సవం, చత్ పూజా వంటి స్థానిక పండగ రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులు పనిచేయవు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సెలవులను కలుపుకుంటేనే 17 రోజుల సెలువు దినాలు అవుతున్నాయి.

Is there 17 days Bank Holidays in November, 2021?: Details here

తెలుగు రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల కంటే తక్కువ రోజులు సెలవు దినాలుగా ఉన్నాయి. వాటిలో దీపావళి, గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ సందర్భంగా రెండు రోజులు బ్యాంకులు పనిచేయవు. ఇక సాధారణ సెలవులు శని, ఆదివారాలను కలుపుకుని మొత్తంగా 8 రోజులు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు దినాలు.

Recommended Video

    Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu

    నవంబర్ నెలలో 17 రోజులు బ్యాంకులకు సెలవులు అనే ప్రచారంతో తెలుగు రాష్ట్రాల బ్యాంక్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నవంబర్ 4న దీపావళి కాగా, నవంబర్ 19న గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ. ఈ రెండు రోజులు బ్యాంకులకు సెలవు దినాలు. ఇక నవంబర్ 7న ఆదివారం, నవంబర్ 13న శనివారం, నవంబర్ 14న ఆదివారం, నవంబర్ 21న ఆదివారం, నవంబర్ 27న నాలుగో శనివారం, నవంబర్ 28న ఆదివారం.. ఇలా 8 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయవు. మిగితా రోజులు వినియోగదారులు బ్యాంకుల్లో తమ పనిని పూర్తి చేసుకోవచ్చు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+