సంగారెడ్డి ప్రజాగర్జన సభ: ఇదేనా బంగారు తెలంగాణ? ధ్వజమెత్తిన రాహుల్ గాంధీ

నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు దేనికోసం పోరాటం చేశారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నంచారు. గురువారం సాయంత్రం సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ ప్రజాగర్జన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసం

సంగారెడ్డి: నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు దేనికోసం పోరాటం చేశారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నంచారు. గురువారం సాయంత్రం సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ ప్రజాగర్జన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

నీరు, నిధులు, ఉద్యోగాల కోసమే ప్రజలు తెలంగాణ కోరుకున్నారని అన్నారు. తెలంగాణ వస్తే నిరుద్యోగం పోతుందని అనుకున్నారని, అందుకే తెలంగాణ విద్యార్థులు, యువత ఉద్యమాన్ని నడిపారని ఆయన వ్యాఖ్యానించారు.

కన్న కలలు సాకారం అయ్యాయా?

కన్న కలలు సాకారం అయ్యాయా?

తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకున్న సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని రాహుల్ గాంధీ చెప్పారు. . మరి ఎవరైతే ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారో.. ఆ నాలుగు కోట్ల ప్రజల కలలు సాకారమయ్యాయా? అని ఆయన ప్రశ్నించారు. అసలు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఎవరి కోసం పోరాటం చేశారు? విద్యార్థులు, రైతులు ఒక కుటుంబం కోసమే పోరాటం చేశారా? అని రాహుల్ గాంధీ పరోక్షంగా సీఎం కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సభలో ప్రశ్నించారు.

సరైన దిశలోనే వెళుతున్నామా?

సరైన దిశలోనే వెళుతున్నామా?

మనం కన్న కలలు మూడేళ్లలో సాకారం కావని తనకూ తెలుసునని, అయితే గడిచిన మూడేళ్లలో అభివృద్ధి ఏమైనా జరిగిందా? అని రాహుల్ గాంధీ సభాముఖంగా ప్రశ్నించారు.
ఇదేనా బంగారు తెలంగాణ? ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను లాక్కోవడానికే తెలంగాణ ఏర్పాటు అయిందా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నారు? కాంట్రాక్టర్లు, ల్యాండ్ మాఫియా కోసం పనిచేస్తున్నారు, కొత్త కొత్త అంచనాలతో ముఖ్యమంత్రి కేసీఆర్.. కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారని రాహుల్ దుయ్యబట్టారు.

రైతుల రుణ మాఫీ ఎక్కడ?

రైతుల రుణ మాఫీ ఎక్కడ?

గత మూడేళ్లలో 2855 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఒక్క సీఎం కేసీఆర్ నియోజవర్గంలోనే 100 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూ.70 వేల కోట్లు రుణమాఫీ చేశామని రాహుల్ గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ఒకేసారి రుణమాఫీ చేసిందని, ఒకే విడతలో రుణమాఫీ వల్ల రైతులకు కొత్తగా రుణాలు ఇచ్చే అవకాశం వచ్చిందని తెలిపారు. తెలంగాణలో నేటికీ రైతుల రుణమాఫీ జరగలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ద్వారాలు తెరిచి కూర్చునేవని, ఇప్పుడేమో ఎక్కడా రుణం పుట్టడం లేదన్నారు. రుణమాఫీ చేసి ఉంటే.. మరి రైతుల పాసు పుస్తకాలు, మహిళల నగలు ఇంకా బ్యాంకుల్లోనే ఎందుకున్నాయంటూ ఆయన ప్రశ్నించారు.

మిర్చి వేసుకోమన్నారు.. ఇప్పుడేమైంది?

మిర్చి వేసుకోమన్నారు.. ఇప్పుడేమైంది?

గిట్టుబాటు ధర అడిగితే రైతులకు బేడీలు వేస్తున్నారని, గిట్టుబాటు ధర అడిగినందుకు రైతులకు సంకెళ్లు వేసిన పాపాన్ని కూడా చూశామన్నారు. ఖమ్మంలో సంకెళ్లు వేసిన రైతులతో తాను మాట్లాడానని రాహుల్ చెప్పారు. సీఎం మాటలు విని రైతులు మిర్చి పంట వేసుకున్నారని, గతంలో మిర్చి రూ.12 వేలు ఉంటే ఇప్పుడు రూ.3 వేలు పలుకుతోందన్నారు. రైతుల స్మశానంగా మారడానికి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కాలేదన్నారు.

ఏవీ.. ఎక్కడ ఆ ఉద్యోగాలు?

ఏవీ.. ఎక్కడ ఆ ఉద్యోగాలు?

తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారని, కానీ ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు సృష్టించిన పాపాన పోలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. ఒకవైపు ఉద్యోగాలు లేక, చేయడానికి ఉపాధి సైతం దొరక్క గ్రామాల నుంచి యువత వలసపోతోందన్నారు. మేకిన్ ఇండియా పేరుతో మోడీ చాలా మాటలు చెప్పారని, 70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడే నిరుద్యోగ సమస్య ఉందన్నారు. మూడేళ్లపాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా మాయ చేశారని రాహుల్ విమర్శించారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆయన ధ్వజమెత్తారు. దేశంలో 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని అక్కడ మోడీ చెబితే, ఇక్కడేమో సీఎం కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని, తీరా చూస్తే ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని, అసలు మోడీ, కేసీఆర్ లు ఏం చేస్తున్నారు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? లెక్కలు చెప్పాలంటూ రాహుల్ నిలదీశారు.

కాంగ్రెస్ పథకాలను రీడిజైన్ చేస్తున్నారు...

కాంగ్రెస్ పథకాలను రీడిజైన్ చేస్తున్నారు...

కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పారని, తీరా చూస్తే 4 వేల పాఠశాలలను మూసివేస్తున్నారని, కాంగ్రెస్‌ హయాంలో తాము విద్యార్థులందరికీ ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఇచ్చామని, ఈ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని కూడా కేసీఆర్ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందన్నారు. కాంగ్రెస్ పథకాల పేర్లు మార్చి అమలు చేయడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని, కాంగ్రెస్ పథకాలను ఆయన రీడిజైన్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ‘మేడిన్ తెలంగాణ'ను ప్రమోట్ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక మొబైల్ ఫోన్ వెనక చూస్తే.. మేడిన్ తెలంగాణ అని రాసి ఉంటుందన్నారు.

‘మీ డబ్బుతో.. ఆయన ఇల్లు..’

‘మీ డబ్బుతో.. ఆయన ఇల్లు..’

రూ.350 కోట్లతో కేసీఆర్ కొత్తగా క్యాంప్ ఆఫీసు అంటూ ఇల్లు కట్టుకున్నారని, ప్రపంచంలో ఏ సీఎంకి అలాంటి ఇల్లు ఉండదని, ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించారు. ప్రజల జేబుల్లోని డబ్బుతో తాను ఇల్లు కట్టుకున్నారని విమర్శించారు. అదంతా ప్రజల డబ్బు, విద్యార్థుల డబ్బు అని ఆయన వ్యాఖ్యానించారు. పేదలకు మాత్రం పక్కా ఇళ్లు కాగితాలకే పరిమితం అవుతున్నాయని, ఎక్కడా పేదలకు పక్కా ఇళ్లు అందడం లేదని దుయ్యబట్టారు.

ఎక్కడ చూసినా భూకుంభకోణాలే...

ఎక్కడ చూసినా భూకుంభకోణాలే...

దేశంలో ఎక్కడ చూసినా భూకుంభకోణాలే కనిపిస్తున్నాయని, పేద రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని, లక్షల కోట్ల విలువైన భూములను లాక్కున్నారని, దేశంలో భూముల మీదే భారీ అవినీతి జరుగుతోందని, రైతుల అనుమతి లేకుండా వారి భూమిని సేకరించకూడదంటూ 2013లోనే కాంగ్రెస్ హయాంలో అవినీతికి వ్యతిరేకంగా భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చామని వివరించారు. ఈ చట్టం ప్రకారం భూమి సేకరిస్తే రైతుకు మార్కెట్ ధరకు నాలుగు రెట్టు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కానీ ఈ భూసేకరణ చట్టాన్ని ఢిల్లీలో మోడీ, తెలంగాణలో కేసీఆర్ తుంగలో తొక్కారని విమర్శించారు. ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు మోడీ మూడుసార్లు ఆర్డినెన్స్ తెచ్చే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ అడ్డుకుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+