జర్నలిస్ట్ రేవతి అరెస్ట్- మీ మొహబ్బత్ కా దుకాణ్ అంటే ఇదేనా
KTR: సీనియర్ జర్నలిస్ట్ రేవతి అరెస్ట్ పట్ల భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఈ చర్య పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎమర్జెన్సీ తరహా వాతావరణం నెలకొందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రేవతికి సంఘీభావాన్ని తెలియజేశారు.
ఈ తెల్లవారు జామున 5 గంటల సమయంలో జర్నలిస్ట్ రేవతి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆమె ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవతితో పాటు తన్వీ యాదవ్ అనే మరో జర్నలిస్టునూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రెండు అరెస్టుల పట్ల కేటీఆర్ స్పందించారు. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆయన పోస్ట్ చేశారు.
రేవతి, తన్వీ యాదవ్ ఇంటిపై దాడి చేసి వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం- రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమర్జెన్సీ తరహా పాలనకు నిదర్శనమంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఒక రైతు కాంగ్రెస్ సర్కార్‌లో తాను ఎదుర్కొంటున్న కష్టాల గురించి చెబితే ఆ వీడియోను పోస్టు చేసిన జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వ నిర్బంధ పాలనకు పరాకాష్ట అంటూ అభివర్ణించారు.

ప్రజా పాలనలో మీడియా స్వేచ్ఛ అనేదే లేకుండా పోయిందంటూ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెబుతోన్న రాజ్యాంగ బద్ధమైన పాలన అంటే ఇదేనా? అంటూ నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రధాన మీడియా, సోషల్ మీడియా గొంతుకలపై చేస్తున్న ఈ దాడులను, అక్రమ కేసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఆపాలంటూ డిమాండ్ చేశారు.
Kya Yahi Hain Aap Ki “Mohabbat Ki Dukaan” ? @RahulGandhi Ji?
— KTR (@KTRBRS) March 12, 2025
Arresting two women journalists in the wee hours of the morning!! What is their crime?
Giving voice to the public opinion on incompetent & corrupt Congress Govt
Last I checked, the Constitution of India that you… https://t.co/DW1EP0JYCU
రాహుల్ గాంధీ ఎప్పుడూ చెప్పే మొహబ్బత్ కి దుకాణ్ అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు కేటీఆర్. తెల్లవారుజామున ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేయడం సరికాదని, వాళ్లు చేసిన నేరం ఏమిటంటూ నిలదీశారు. అసమర్థ, అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయానికి విలువ లేకుండా పోయిందని అన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications