హైదరాబాద్‌లో ఐసిస్ సానుభూతిపరుడు సులేమాన్ అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల కదలికలు కలకలం రేపాయి. ఐసిస్ ఉగ్రవాదంపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా హైదరాబాద్ నుంచి వెళ్లి యుద్ధం చేయాలని సులేమాన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
అతని ఐపీ అడ్రస్ ద్వారా మీర్‌చౌక్ పోలీసుస్టేషన్ పరిధిలో సులేమాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, గత కొన్నాళ్లుగా యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించే విధంగా సులేమాన్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. 2002లోనే పహడీ షరీఫ్‌లో సులేమాన్‌కు రాచకొండ ఎస్ఓటీ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పురాలేదు.

కొన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న సులేమాన్ తరువాత ఫండింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం అతనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సోషల్ మీడియాలో 20 ఖాతాలను తెరిచిన సులేమాన్ యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు.
హైదరాబాద్ పాతబస్తీలో ఉగ్రవాద సానుభూతిపరుల కదలికలు మళ్లీ తెరమీదకు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికతో ఎన్ఐఏ, హైదరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications