Kamareddy: వారిని కాపాడబోయి ఎస్సై సాయి కుమార్ మృతి..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఎస్సై, కానిస్టేబుల్, యువకుడి ఆత్మహత్యకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఎస్సై సాయి కుమార్ ఆత్మహత్య చేసుకోలేదని తెలుస్తోంది. కానిస్టేబుల్ శృతి, యువకుడు నిఖిల్ కాపాడడానికే సాయి కుమార్ చెరువులోకి దూకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం ఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తు బృందం నీటిలో దిగి నీటి శాంపిళ్లను సేకరించింది. మరోవైపు అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వచ్చే మార్గంలో సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించారు.
వాటిని విశ్లేషిస్తున్నారు. ఎస్ఐ వాహనానికి సంబంధించి సైడ్ డోర్ గ్లాసులకు బ్లాక్ పేపర్ ఉండటం వల్ల అందులో ఎవరెవరు ఉన్నారన్నది సీసీ ఫుటేజ్ లో సరిగా కనిపించడం లేదని సమాచారం. సాయి కుమార్ బుధవారం భిక్కనూరు పోలీస్ స్టేషన్ నుంచి ఉదయం 11:30 గంటలకు తన సొంత కారులో బయటకు వచ్చారు. కానిస్టేబుల్ శృతిని, బీబీపేట సొసైటీలో పనిచేసే ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ను పొందుర్తి శివారులో కారు ఎక్కించుకున్నట్లు తెలిసింది.

వారులో కారులో కొద్దిసేపు మాట్లాడుకున్నారని.. ఆ తర్వాత గాంధారి ఎక్స్ రోడ్ వద్ద దించడానికి సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి సమీపంలో ఉన్న చెరువు నుంచి వెళ్లాలని సాయి కుమార్ భావించాడు. ఈ క్రమంలోనే చెరువు వద్ద రాగానే.. శృతి ఆవేశంగా వెళ్లి చెరువులో దూకినట్లు భావిస్తున్నారు. ఆ తర్వాత నిఖిల్ కూడా చెరువులోకి దూకగా.. వారిని కాపాడేందుకు ఎస్సై సాయి కుమార్ సైతం చెరువులో దూకినట్లు తెలుస్తోంది.
చెరువులో లోతు ఎక్కువగా ఉండడంతో ముగ్గురు మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. మరోవైపు ఎస్సై సాయి కుమార్ ఫోన్ లో శృతి తో చాటు చేసినట్లు తెలిసింది. అలాగే నిఖిల్, శృతి కూడా చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. చాటింగ్ లో ఇద్దరు కలిసి చనిపోదామని ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎస్సై సాయి కుమార్ శృతితో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం భార్య మహాలక్ష్మి తెలియడంతో ఆమె ఊరు వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ కేసు విచారణ రెండు మూడు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications