సాఫ్టువేర్ ఉద్యోగాల్లో బెంగళూరుదే హవా కానీ, రెండో స్థానంలో హైదరాబాద్

ఐటీ ఉద్యోగాల అవకాశాలు ఉన్న నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో, హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్లు యూత్4వర్క్ సర్వేలో తేలింది.

ముంబై: ఐటీ ఉద్యోగాల అవకాశాలు ఉన్న నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో, హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్లు యూత్4వర్క్ సర్వేలో తేలింది.

ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న నగరాల్లో బెంగళూరు 30 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత హైదరాబాద్‌ 19 శాతం, ఢిల్లీ 17 శాతం, అహ్మదాబాద్‌ 12 శాతం, ముంబై 11 శాతం, చెన్నై 11 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

హార్డ్ వేర్ ఇంజినీరింగ్ విషయంలోను బెంగళూరు తొలిస్థానంలో ఉంది. బెంగళూరు 30 శాతం, హైదరాబాద్ 18 శాతం, చెన్నై 17 శాతం, ఢిల్లీ 17 శాతం, ముంబై 14 శాతం, అహ్మదాబాద్ 4 శాతంతో ఉన్నాయి.

IT jobs spread beyond Bengaluru, finds study

ఒకప్పుడు బెంగళూరుకు మాత్రమే పరిమితమైన ఉద్యోగాలు, ఇప్పుడు చెన్నై, ముంబై, అహ్మదాబాద్‌, ఢిల్లీ, హైదరాబాద్‌లకు సైతం వ్యాపిస్తున్నాయని ఈ సర్వే తెలిపింది.

28 శాతం బెంగళూరు యువత సాఫ్టువేర్ ఉద్యోగాలు చేస్తుంటే, ఆ తర్వాతి స్థానాల్లో హైదరాబాద్‌ 23 శాతం, ఢిల్లీ 22 శాతం, ముంబై 15 శాతం, చెన్నై 10 శాతంతో నిలిచాయి.

ఇక ఢిల్లీలో 26 శాతం మంది యువత హార్డ్‌వేర్‌ ఉద్యోగాలకు మొగ్గుచూపుతున్నారు. ఈ సంఖ్య బెంగళూరు 24 శాతం, హైదరాబాద్‌ 20 శాతం, చెన్నై 12 శాతంలో చొప్పున ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+