టీ హబ్ ఇన్నోఫెస్ట్‌లో కేటీఆర్ సెల్ఫీలు, కేరింతలు (ఫోటోలు)
హైదరాబాద్: కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా హైదరాబాద్ మారుతుందని రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇటువంటి నూతన ఆవిష్కరణలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్ అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
వినూత్న రీతిలో డ్రోన్ పరిజ్ఞానంతో రూపొందించిన ఇన్నోఫెస్ట్‌ను ఆయన శనివారం గచ్చిబౌలిలోని టీ హబ్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్ టీ హబ్‌ను ప్రారంభించిన నెల రోజుల్లోపే చక్కని కార్యక్రమానికి వేదిక కావడం సంతోషకరమని తెలిపారు.

టీ హబ్ ఇన్నోఫెస్ట్‌లో కేటీఆర్ సెల్ఫీలు, కేరింతలు
ఆవిష్కరణలంటే టెక్నాలజీపరమైనవేనన్న భావన గలవారి అభిప్రాయాలను ఇన్నోఫెస్ట్ దూరం చేసిందన్నారు. ఇన్నోఫెస్ట్‌లో జరిగిన ఆవిష్కరణలు రైతులకు ఉపయోగకరం అన్నారు.

టీ హబ్ ఇన్నోఫెస్ట్‌లో కేటీఆర్ సెల్ఫీలు, కేరింతలు
ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్‌కార్పొరేట్ అనే మంత్రాన్ని గుర్తుంచుకొని డిఫైన్, డిజైన్, డెలివర్ అనే అంశాలతో యువత ముందుకెళ్లాలని ఆయన తెలిపారు.

టీ హబ్ ఇన్నోఫెస్ట్‌లో కేటీఆర్ సెల్ఫీలు, కేరింతలు
ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇచ్చే అమెరికన్లు, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రచారానికి ప్రముఖస్థానం కల్పిస్తారని, అందుకే వారి ఆవిష్కరణలు ప్రముఖంగా ఉంటాయని చెప్పారు.

టీ హబ్ ఇన్నోఫెస్ట్‌లో కేటీఆర్ సెల్ఫీలు, కేరింతలు
రాజకీయ నాయకులు 150 ఏళ్ల బతకాలన్న ఏంజిల్ ఇన్వెస్టర్ మోహన్‌దాస్‌పాయ్ వ్యాఖ్యపై కేటీఆర్ స్పందిస్తూ అమెరికాలోగల సాంకేతిక సౌలభ్యంవల్ల ఆ దేశ పౌరులు వందేళ్లు బతుకుతారు.

టీ హబ్ ఇన్నోఫెస్ట్‌లో కేటీఆర్ సెల్ఫీలు, కేరింతలు
మన దేశంలోని రాజకీయవేత్తలు ప్రస్తుత అందుబాటులో ఉన్న సాంకేతిక సౌలభ్యంతో అంత కాలం జీవించే అవకాశం ఉందేమో అని చమత్కరించారు.

టీ హబ్ ఇన్నోఫెస్ట్‌లో కేటీఆర్ సెల్ఫీలు, కేరింతలు
ఏంజిల్ ఇన్వెస్టర్ మోహన్‌దాస్‌పాయ్ మాట్లాడుతూ టెక్నాలజీతో భవిష్యత్ ముఖచిత్రం మారనున్నదని జోస్యం చెప్పారు. వేదిక్ స్కాలర్ సుదర్శనశర్మ మాట్లాడుతూ ప్రపంచ దేశాల కంటే ముందే భారత్‌లో సాంకేతిక పరిజ్ఞాన బీజాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

టీ హబ్ ఇన్నోఫెస్ట్‌లో కేటీఆర్ సెల్ఫీలు, కేరింతలు
శనివారం గచ్చిబౌలిలో జరిగిన ఈ ఇన్నోఫెస్ట్‌లో 300 ఆవిష్కరణలు జరిగాయి. 1200 మంది అతిథులు హాజరయ్యారు. ఫెస్ట్‌లో ఆవిష్కర్తలు, యువతీ యువకుల ఉత్సాహం మేరకు కేటీఆర్ వారితో కలిసి సెల్ఫీలు దిగారు.












Click it and Unblock the Notifications