జానారెడ్డితో సహా కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఐటీ సోదాలు..!!
తెలంగాణలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలు నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడుతున్నాయి. ఇదే సమయంలో ఐటీ దాడులు సంచలనంగా మారాయి. హైదరాబాద్ కేంద్రంగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారితో పాటుగా అభ్యర్దుల ఇళ్లు..కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కేఎల్‌ఆర్ నివాసంతో పాటుగా ఆయన కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
కొనసాగుతున్న సోదాలు:తెలంగాణలో ఎన్నికల్లో పోటీలో ఉన్న నేతల కార్యాలయాలు..నివాసాలపై ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ ఈ సారి నాగార్జున సాగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా బరిలో ఉన్నారు. ఆయనకు సంబంధించిన వ్యాపారా లావాదేవీలపైన ఐటీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కీలక సమాచారం పైన ఆరా తీసినట్లు చెబుతున్నారు. అదే విధంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోడల్లుడు నివాసంలోనూ ఐటీ సోదాలు నిర్వహించారు. ఆయన ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నారు. కాంగ్రెస్ మహేశ్వరం అభ్యర్ది కేఎల్ఆర్ సంస్థల్లో సోదాలు అర్ద్రరాత్రి వరకు కొనసాగాయి.

కేఎల్ఆర్ ఫాం హౌస్ లో:నార్సింగ్‌లోని కేఎల్ఆర్ నివాసంలో నేడు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రాత్రి 1గంట వరకూ ఐటీ బృందం సోదాలు జరిపించింది. ఇంట్లో లభ్యం అయిన డాక్యుమెంట్స్‌ని అధికారులు తీసుకెళ్లారు. మరో 15 మంది అధికారులతో ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్‌లోని కేఎల్ఆర్ హెడ్ క్వార్టర్స్ ఆఫీసులో సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి ఫామ్ హౌజ్ సోదాలు ముగిసిన తర్వాత.. అక్కడ స్టేట్‌మెంట్‌ను అధికారులు నార్సింగ్ ఇంటికి తీసుకొచ్చారు. మరోసారి 5 వాహనాలలో లక్ష్మారెడ్డి ఇంటికి ఐటీ అధికారులు చేరుకున్నారు. సాయంత్రం వరకు సోదాలు జరిగే అవకాశం ఉంది. కొన్ని కీలక డాక్యెమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
కీలక డాక్యమెంట్లు స్వాధీనం:బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతానర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. తెల్లవారుజామున 5గంటలకు ఇంటికి చేరుకుని పారిజాత కుమార్తె ఫోన్ స్వాధీనం చేసుకున్న అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నెల 9న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. బాలాపూర్ గణేశ్ లడ్డూను దక్కించుకున్న వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అదే నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతల ఇండ్లలోనూ అధికారులు తనిఖీలు జరుగుతున్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications