అది బిగ్ బాస్ హౌస్ కాదు.. బ్రోతల్ హౌస్..! వెంటనే నిషేదించాలన్న యాంకర్ శ్వేతారెడ్డి..!!
హైదరాబాద్: బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కాకముందే వివాదాలు చుట్టుముడుతున్నాయి. చెన్నై బిగ్ బాస్ ను మించి పార్టిసిపెంట్స్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక యాంకర్ శ్వేతా రెడ్డి మరో అడుగు ముందడుకు వేసి బిగ్ బాస్ హౌస్ ను వేశ్యా గృహంతో పోల్చింది. 14మంది పోటీ దారులు ఉండే ఇంటిని బ్రోతల్ హౌస్ తో పోల్చి సంచలన వ్యాఖ్యలు చేసారు శ్వేతా రెడ్డి. బిగ్ బాస్ లో పాల్గొనాలంటే బిగ్ బాస్ ను సంతృప్తి పరచడమనే డిమాండ్ ఉందని ఆమె చెప్పుకొస్తున్నారు.

బిగ్ బాస్3 పై మండిపపడ్డ యాంకర్ శ్వేతా రెడ్డి..! అయోమయంలో నిర్వాహకులు..!!
ప్రపంచాని దూరంగా 100 రోజులు గడపాల్సిన ఇంటిని బ్రోతల్ హౌస్ గా అభివర్ణించడంతో శ్వేతా రెడ్డి పై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.పరస్పర విరుద్దమైన 14మంది మనస్తత్వాత మద్య శ్వేతా రెడ్డి ఎలా మన గలుగుతుందని సూటిగా ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అంతే కాకుండా బిగ్ బాస్ నిర్వహకులు కూడా శ్వేతా రెడ్డి పై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమెను ఇంట్లో కొనసాగించాలా.. పంపించెయ్యాలా అని సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. దీనిపై బిగ్ బాస్3 సీజన్ హోస్ట్ నాగార్జున తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది.

బిగ్ బాస్ లో కూడా కాస్టింగ్ కౌచ్..! మండిపడ్డ యాంకర్..!!
బిగ్ బాస్ షోలో పాల్గొనాలంటే వాళ్ల బాస్‌ను ఇంప్రెస్ చేయాలట..! ఉత్తరాది గబ్బు సంస్కృతిని తెలుగువాళ్లపై రుద్దాలని అనుకుంటున్నారా..? తెలుగువాళ్లపై గలీజ్ కల్చర్ రుద్దుతామంటే ఊరుకోం. బిగ్‌బాస్-3ని నిషేధించాలి. తెలుగు టీవీ నుంచి వెలివేయాలి... బిగ్‌బాస్ వల్ల ఎవరూ బాగుపడలేదు. బిగ్‌బాస్ ముసుగులో నిర్వాహకులు బ్రోతల్ హౌస్ నడుపుతున్నారా? అని యాంకర్, జర్నలిస్ట్ శ్వేతారెడ్డి మండిపడ్డారు. బిగ్‌బాస్‌లో క్యాస్టింగ్ కౌచ్ జరుగుతోందని ఆమె ఆరోపించారు. వెంటనే తెలుగు టీవీ నుంచి ఆ కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలని, బిగ్ బాస్ ముసుగులో జరుగుతున్న వాటిని బయటపెట్టడానికే తాను మీడియా ముందుకు ధైర్యంగా వచ్చానని అన్నారు.

అమాయకులు బలవుతున్నారు..! ఎవరిని ఉద్దరించాడానికి అంటున్న శ్వేతరెడ్డి..!!
గత ఏప్రిల్ లో తనకు ఫోన్ వచ్చిందని, బిగ్ బాస్ మూడవ సీజన్ కు ఎంపిక చేశామని చెప్పారని, ఎందుకని అడిగితే, పాప్యులర్ యాంకర్ కాబట్టి తీసుకున్నామని అన్నారని, ఆపై కార్యక్రమ సమన్వయకర్త రవికాంత్ తనకు పలుమార్లు ఫోన్ చేసి, పిలిపించి మాట్లాడారని, ఒప్పందంపై తాను సంతకాలు కూడా చేశానని శ్వేతారెడ్డి తెలిపారు. వాటి జిరాక్స్ లు తనకు ఇవ్వలేదని ఆరోపించారు. ఆపై తమ బాస్ ను ఇంప్రెస్ చేయాలని కార్యక్రమ ప్రొడ్యూసర్ శ్యామ్ తనను అడిగారని, తానెందుకు ఇంప్రెస్ చెయ్యాలని నిలదీశానని, కమిట్‌మెంట్ కావాలని వారు అడిగారని, మహిళల ఆత్మగౌరవానికి ఈ కార్యక్రమం భంగం కలిగిస్తోందని శ్వేతారెడ్డి ఆరోపించారు.
Recommended Video


నా జోలికొస్తే తరిమికొడతా..! తీసుకున్న డాక్యుమెంట్లు ఇవ్వాలంటున్న యాంకర్..!!
ఇప్పటికే చాలా మంది బాధితుల వివరాలు సేకరించానని.. మిగతా వారు బయటికి వస్తారని ఆమె తెలిపారు. ఈ షోలో పాల్గొనడానికి సంబంధించి తనను సంప్రదించిన రఘు, రవికాంత్, శ్యామ్.. ఇప్పుడు ఫోన్లు ఎత్తట్లేదన్నారు. నా డాక్యుమెంట్లు ఇవ్వకుండా జిమ్మిక్కులు చేస్తున్నారా అని ఆమె మండిపడ్డారు. ఆ పత్రాలు తనకు ఇవ్వకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని.. తనతో పాటు మహిళా సంఘాలు ఉన్నాయని హెచ్చరించారు. శ్రీరెడ్డి విషయంలో క్యాస్టింగ్ కౌచ్‌పై ఏర్పాటు చేసిన కమిటీ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. బిగ్‌బాస్-3ని బ్యాన్ చేయాలని.. అసలు ఆ షోనే తెలుగు టెలివిజన్ నుంచి వెలివేయాని శ్వేతారెడ్డి డిమాండ్ చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications