• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మ‌రో ప‌దిగంట‌ల్లో ఐటీ అదికారుల విచార‌ణ‌..!! రేవంత్ రెడ్డి ఏం చేసాడో తెలుసా..?

|
  ఐటీ విచార‌ణ‌ అని తెలిసి రేవంత్ రెడ్డి ఏం చేసాడో తెలుసా..?

  హైద‌రాబాద్ : రాజ‌కీయాల్లో టీపీసిసి వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్ రెడ్డి స్టైల్ భిన్నంగా ఉంటుంది. దూకుడుగా మాట్ల‌డ‌టం, చ‌లాకీగా క‌ద‌ల‌డం, ప‌దునైన మాట‌ల తూటాలు పేల్చ‌డం, తాను ప్ర‌సంగిస్తున్న‌ప్పుడు ప్రేక్ష‌కుల‌ను మంత్ర ముగ్దుల‌ను చేయ‌డం, మ‌ద్య‌లో హాస్యాన్ని జోడిస్తూ అభిమానుల‌ను ఉర్రూత‌లూగించ‌డం రేవంత్ లోని ప్ర‌త్యేక‌త‌లుగా చెప్పొచ్చు. ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్నిక‌ళ‌లు ఉన్నా న్యాయ‌ విచార‌ణ‌లు, కోర్టు కేసులు అనే స‌రికి ఎవ‌రికైనా కాస్త ద‌డ‌పుట్టే వ్య‌వ‌హార‌మే..! కాని రేవంత్ రెడ్డి లాంటి ఫుల్ టైమ్ పొలిటీషియ‌న్ కి ప్ర‌త్య‌ర్థుల ఎత్తులకు పైఎత్తులు వేయ‌డం, వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహాలు చేయ‌డం వెన్న‌తో పెట్టిని విద్య‌. అలాగే కోర్టు కేసులు, విచార‌ణ‌లు ఎదుర్కోవాల్సి ఉన్న‌ప్ప‌టికి పెద్ద‌గా జంకు, భ‌యం రేవంత్ లో అంత‌గా క‌నిపించ‌వు. నిన్న‌టికి నిన్న ఐటీ అదికారుల ఎదుట‌ మ‌రో ప‌ది గంట‌ల్లో విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సి ఉన్నా రేవంత్ రెడ్డి, ఏమాత్రం టెన్ష‌న్ లేకుండా అంత రిలాక్స్ అయ్యారంటే ఆశ్చ‌ర్యం వేయ‌క మానదు..!!

  తెలుగు రాష్ట్రాలో రేవంత్ రెడ్డి హాట్ టాఫిక్...!రేవంత్ లక్ష్యంగా ప్రత్యర్థుల క‌ద‌లిక‌లు..!!

  తెలుగు రాష్ట్రాలో రేవంత్ రెడ్డి హాట్ టాఫిక్...!రేవంత్ లక్ష్యంగా ప్రత్యర్థుల క‌ద‌లిక‌లు..!!

  కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలో హాట్ టాఫిక్. ఆయనే లక్ష్యంగా ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. రాజకీయంగా లక్ష్యంగా చేసుకొని రేవంత్ రెడ్డిని కార్నర్ చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. తాజాగా ఆయనపైన ఆదాయ పన్ను శాఖ దాడులు జరిగాయి. ఏకంగా మూడు రోజులు ఏక‌దాటిగా అధికారులు రేవంత్ రెడ్డితో పాటు ఆయన బంధువులు, అనుచరుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ప్రశ్నలతో గంటల తరబడి ఆయనను విసిగించారు. దీంతో రేవంత్ రెడ్డి అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది.

  రేవంత్ రెడ్డి ఏంట‌న్న దానిపై ఆసక్తికరమైన చర్చ..! అరెస్టు చేస్తార‌ని పుకార్లు..!!

  రేవంత్ రెడ్డి ఏంట‌న్న దానిపై ఆసక్తికరమైన చర్చ..! అరెస్టు చేస్తార‌ని పుకార్లు..!!

  మొదటి నుంచి ఆయనతో ఉన్న నాయకులు,కార్యకర్తలు,అభిమానులు నిద్రాహారాలు మాని మూడు రోజుల పాటు ఇంటి దగ్గర ఉన్నారు. రేవంత్ ఇంట్లో సోదాలు ముగిసిన తర్వాతే వారు అక్కడి నుంచి కదిలారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమటన్న దానిపైన ఆసక్తికరమైన చర్చ జరిగింది. అరెస్టు చేస్తారన్న ఆందోళన ఆయన అభిమానుల్లో వ్యక్తమైంది. మరో వైపు సోదాలు ముగిసినప్పటికి మరో సారి విచారణకు రావాలని రేవంత్ రెడ్డికి ఐటి అధికారులు నోటీసులు జారీ చేశారు.

  ఎలాంటి ఒత్తిడి లేదు..! అలా అని ఇంట్లో అదికారుల‌కు కావాల్సిన స‌రుకూ లేదు..!!

  ఎలాంటి ఒత్తిడి లేదు..! అలా అని ఇంట్లో అదికారుల‌కు కావాల్సిన స‌రుకూ లేదు..!!

  మొత్తంగా రేవంత్ పూర్తి స్థాయిలో ఒత్తిడికి గురికావాల్సిన సందర్భం. మానసికంగా, శారీరకంగా తీవ్రంగా అలసిపోయే వాతావరణం. కాని రేవంత్ రెడ్డి మాత్రం పూర్తి మనోధైర్యాన్ని ప్రదర్శించారు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా నిబ్బరాన్ని కనపర్చారు. దాడులు పూర్తి కాగానే మీడియా ముందుకు వెళ్లి తన ఉద్దేశాలను స్పష్టం చేశారు. మరో వైపు ఐటి అధికారుల ముందు విచారణకు వెళ్లే సమయంలో ఎవరైనా ఒత్తిడికి లోనుకావడం లేదా ప్రిపేర్ కావడం చేస్తుంటారు. కాని రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి చక్కగా తన కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లారు.

  ఏమీ లేన‌ప్పుడు ఎందుకు భ‌యం..! సినిమా చూస్తే పోలా..!!

  ఏమీ లేన‌ప్పుడు ఎందుకు భ‌యం..! సినిమా చూస్తే పోలా..!!

  మరో పన్నెండు గంటల్లో విచారణ ఉందని తెలిసినప్పటికి ఆయన హాయిగా సినిమాను ఎంజాయ్ చేయడం విశేషం. తన వద్ద అక్రమాస్తులు లేనప్పుడు ఎందుకు భయపడాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన అని సన్నిహితులు చెపుతున్నారు. కచ్చితంగా తనను లక్ష్యంగా చేసుకొని అన్ని వైపుల నుంచి ఏదో విధంగా దాడి జరుగుతుందని రేవంత్ బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆయన అన్నింటికి సిద్ధమై ఉన్నట్లు కనిపిస్తోంది. మరి తమకు కొరకరాని కొయ్యలా తయారైన రేవంత్ రెడ్డిని ప్రత్యర్థులు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Though he was aware of another trial in twelve hours, he enjoyed the movie. Reverend Reddy's idea of ​​why fearing him. Revanth is strongly convinced that somehow attacked from all sides by targeting him accurately.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more