వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది అఖండ విజయం.!బాణాసంచా కాల్చి వేడుకలు.!బాలయ్య ఫాన్స్ హడావిడి.!

|
Google Oneindia TeluguNews

హదరాబాద్ : ప్రముఖ చిత్ర నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా దిగ్విజయంగా ప్రదర్శిస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మండవ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నారా, నందమూరి అభిమానులు బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం బాలయ్యబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చిత్రాన్ని అద్భుతంగా మలచిన దర్శక నిర్మాతలకు చిత్ర యూనిట్ సభ్యులకు ఈ సందర్భంగా వారు అభినందనలు తెలియజేశారు బాలయ్య బాబు సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో రారాజుగా వెలుగొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్ కె అలీ, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మీసాల సైదులు,పెండెం అంజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

It was a resounding success!Balayya Fans celebrations.!

ఇదిలా ఉండగా నందమూరి నటసింహం బాలకృష్ణ 106వ సినిమా అఖండ విడుదల సందర్భంగా వనపర్తి శ్రీనివాస ధియేటర్ లో సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు నందిమల్ల అశోక్ హాజరై అఖండ కేక్ కట్ చేసి సీనియర్ ఎన్. టి.ఆర్, బాలకృష్ణ, జూనియర్.ఎన్. టి.ఆర్ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజకీయ రంగంలోనైనా, సినీ రంగంలో నైన రికార్డులు సృష్టించడం ఒక్క నందమూరి వంశానికే సాధ్యమని అన్నారు. అఖండ సినిమా అఖండ విజయం సాధించాలని అన్నారు. అభిమానులు వెంకటేష్, కురుమూర్తి, నరసింహా, థియేటర్ నిర్వాహకులు చంద్రశేఖర్, చంద్రారెడ్డి, కిరణ్, బాలయ్య, బాలరాం తదితరులు పాల్గొన్నారు.

Recommended Video

Lakshya Trailer Review | Akhanda Movie Is The Deciding Factor || Oneindia Telugu
It was a resounding success!Balayya Fans celebrations.!
English summary
Nara and Nandamuri fans under the patronage of Telugudesam party leaders Mandava Venkateshwar set off fireworks to celebrate the triumph of Akhanda film starring Nandamuri Balakrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X