అద్భుతం: టిఎస్ ఐపాస్‌పై సిఎం కెసిఆర్‌కు ఐటిసి ఛైర్మన్ లేఖ
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పారిశ్రామిక విధానం(టీఎస్‌ఐపాస్)పై పారిశ్రామిక దిగ్గజం, ఐటిసి ఛైర్మన్ వైసి దేవేశ్వర్ ప్రశంసల వర్షం కురిపించారు. మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో ఐటిసి సంస్థ స్థాపించ తలపెట్టిన ఆహారశుద్ధి మ్యానుఫాక్చరింగ్, లాజిస్టిక్ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం 12 రోజుల్లోనే అనుమతివ్వటంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
పారిశ్రామిక విధానం అద్భుతమంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. ఇలాంటి విధానాన్ని ఎక్కడా చూడలేదని, అద్భుత పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. సింగిల్ విండో విధానం ద్వారా తమ దరఖాస్తుకు రికార్డు స్థాయిలో 12 రోజుల్లోనే ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. ఇది నూతన పారిశ్రామిక విధాన శక్తిసామర్థ్యాలకు నిదర్శనమని తెలిపారు.

ఇలాంటి ఉదాహరణలు పెట్టుబడులహిత, గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్ర విశ్వసనీయతను మరింత ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తాయని చెప్పారు. ‘ముఖ్యమంత్రి గారూ.. మీ నాయకత్వం అద్భుతంగా ఉంది. ఇది మా ప్రాజెక్టును మరింత వేగంగా చేపట్టేందుకు మాలో స్ఫూర్తిని నింపింది. మీ రాష్ట్ర వినూత్న మార్గం మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేసింది' అని లేఖలో పేర్కొన్నారు.
‘ప్రోత్సాహక ప్యాకేజీ కోసం ఇప్పుడు మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై మీ ఆశయంలో పాలుపంచుకొంటామని, చిత్తశుద్ధితో కృషిచేస్తామని హామీ ఇస్తున్నాం' అని లేఖలో ఐటిసి ఛైర్మన్ దేవేశ్వర్ స్పష్టం చేశారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications