ఇవాంక ఓ మంచి తల్లి కూడా: బిడ్డను, భార్యను అని... ఆ తర్వాతే....

హైదరాబాద్: ఇవాంక ట్రంప్ అంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురిగానూ, ఆయన సలహాదారుగానూ గుర్తిస్తాం. ఆ తర్వాత ఓ ఫ్యాషన్ డిజైనర్‌గా, వ్యాపారవేత్తగా కూడా గుర్తిస్తాం. కానీ అన్నింటికి మించి తన పిల్లలకు మంచి తల్లి కూడా.

'నేనొక భార్యను... తల్లిని... చెల్లిని... బిడ్డను... ఆ తర్వాతనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తను, ప్రభుత్వ సలహాదారును అని ఆమె తన ట్విటర్, ఫేస్‌బుక్‌లో తన పరిచయాన్ని రాసుకున్నారు. అందుకు తగినట్లుగానే హైదరాబాద్ పర్యటనలో ఆమె ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంది.

డయానా తర్వాత...

డయానా తర్వాత...

గతంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన డయానా మాదిరిగానే రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఇవాంక ఇక్కడి ప్రజల మనసు దోచుకున్నారు. అందరితో కలుపుగోలుగా మాట్లాడుతూ, కరచాలనం చేస్తూ ఓ సాధారణ మహిళలాగా కనిపించారు.

ఇలా హల్‌చల్...

ఇలా హల్‌చల్...

ఓ యూదు జాతీయుడిని పెళ్లి చేసుకోవడం కోసం ఆమె మతం మార్చుకుంది. అయితే, తల్లిగా ఆమె తన కర్తవ్యాన్ని అద్భుతంగా నిర్వహిస్తోందని అంటున్నారు. పిల్లలకు విమానాశ్రయంలో, ప్రజా సమూహాల్లో, టూరిస్టు ప్రదేశాల్లో తన పిల్లలను చంకనెత్తుకుని తానే తీుకుని వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

తల్లిని చూశా...

తల్లిని చూశా...

ఇవాంకలో కొందరు అమెరికా అధ్యక్షుడిని చూస్తున్నారని, కొందరు ఆమెను కార్పోరేట్ దిగ్గజంగా చూస్తున్నారని, తాను మాత్రం ఆమెలో ఒక తల్లిని చూస్తున్నానని ఒకతను సురేష్ వెంపటి రాశాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాఫ్ట్‌వేర్ అయితే వెనక మొగుళ్లు పిల్లలని ఎత్తుకుని తిరగడం చూశానని, మన భారతీయుల్లో ధనవంతులూ ఉద్యోగస్తుల పిల్లలను ఆయన ఎత్తుకుని తిరుగుతుందని అనన్ాడు. తాను ఎన్ని ఫొటోలు చూసినా ఇవాం చంకలో ఓ పిల్లను వేసుకుని కనిపించిందని రాశాడు.

ఎర్రబస్సు ఎక్కి....

ఎర్రబస్సు ఎక్కి....

ఈ మధ్య కాలంలో ఇలా పిల్లల్ని ఎత్తుకుని తిరిగే తల్లిని ఇవాంకలో చూశానని ఆయన రాశాడు. మన దేశంలో ఎర్రబస్సు ఎక్కి ఊర్లు తిరుగుున్నప్పుడు 'పుట్టింటికి వెళ్తున్న 3 పిల్లల మధ్య తరగతి తల్లిలా కనిపించింది' కనిపించింది అని రాశాడు. ఇది ఎయిర్ బస్ అంతే తేడా అని ముక్తాయింపు ఇచ్చారు.

చిరునవ్వు

చిరునవ్వు

రెండు రోజుల హైదరాబాద్ పర్యటనలో ఇవాంక మోముపై చిరునవ్వు చెరగలేదు. అందరినీ చిరుతనవ్వుతో పలకరించారు. ఇతరుల ప్రసంగాల్లో తనకు నచ్చిన వ్యాఖ్యలు విన్నప్పుడు ఓ సాధారణ మహిళలాగా చప్పట్లు కొట్టారు. ఏ విధమైన డాంబికం కూడా కనిపించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+