చివరి నిమిషంలో ఇవాంకా బసచేసే హోటల్ మార్పు: మహిళా ప్రాధాన్యత సదస్సు
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా ఆమె ట్రైడెంట్ హోటల్ చేరుకున్నారు. చివరి నిమిషంలో ఇవాంకా బస చేసే హోటల్ మారింది.
హైదరాబాద్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా ఆమె ట్రైడెంట్ హోటల్ చేరుకున్నారు. చివరి నిమిషంలో ఇవాంకా బస చేసే హోటల్ మారింది.

ఇవాంకా ట్రంప్
ఇవాంకా ట్రంప్ మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు తెలంగాణ మంత్రులు, అమెరికా రాయబారి ఘన స్వాగతం పలికారు.

తొలుత వెస్టిన్ హోటల్ అనుకున్నారు కానీ
అక్కడి నుంచి ఆమె తొలుత చెప్పిన ప్రకారం వెస్టిన్ హోటల్‌కు వెళ్లాలి. కానీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనంలో మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్‌కు చేరుకున్నారు. భద్రతా కారణాలతో చివరి నిమిషంలో హోటల్ మార్చారని తెలుస్తోంది.

ఇవాంకా రాక కోసం నగరం ముస్తాబుకు రూ.43 కోట్లు
కాగా, ఇవాంకా రాక నేపథ్యంలో నగరం ముస్తాబుకు రూ.43 కోట్ల వరకు ఖర్చయిందని తెలుస్తోంది. ఆమె వచ్చిపోయే దారిలో గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. అలాగే, ఆమె వెళ్లే దారిలో రోడ్లను సుందరంగా తయారు చేశారు.

మహిళా ప్రాధాన్య సదస్సు
కాగా, ఈ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సదస్సులో మహిళలకు అధిక ప్రాధాన్యం. దాదాపు చాలా దేశాలు కేవలం మహిళలనే ఈ సదస్సుకు పంపించాయి. 170 దేశాల నుంచి 1500 ప్రతినిధులు పాల్గొంటారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులు, కార్పోరేట్ దిగ్గజాలు ఈ సమ్మిట్‌లో పాల్గొంటారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications