హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జాకీచాన్: కార్లలో వచ్చి క్షణాల్లో దోచేసి, పారిపోతాడు (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కారులో వచ్చి క్షణాల్లో దొంగతనాలు చేసి పరారయ్యే ఓ ఖరీదైన దొంగను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అతడ్ని విచారించగా మరో 29 చోరీ కేసుల వివరాలు కూడా బట్టబయలయ్యాయి. ఈ దొంగ నుంచి పోలీసులు దాదాపు 77 లక్షలు విలువ చేసే సోత్తును స్వాధీనం చేసుకున్నారు.

ఇది ఇలా ఉండగా, మరో కరుడుఘట్టిన దొంగ జాకీ చాన్ అలియాస్ మేకల వెంకటేష్‌ను పట్టుకున్న పోలీసులు.. అతడి నుంచి 15 లక్షలపై సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసులలో సైబరాబాద్ పోలీసులు కోటి రుపాయల విలువైన సొత్తును రికవరీ చేశారు.

సైబరాబాద్ క్రైం డీసీపీ నవీన్‌కుమార్ బుధవారం ఈ కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వట్టేపాలెంకు చెందిన మిక్కిలి వంశీకృష్ణ అలియాస్ లోకేష్ 2006 నుంచి తాళం ఉన్న ఇళ్ళలో చోరీలు చేస్తున్నాడు. అప్పట్లో 11 హెచ్‌బీ కేసులలో సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు.

జైలు జీవితం అనుభవించినప్పటికీ అతనిలో మార్పురాలేదు. అంతేగాక, వంశీకృష్ణ రెగ్యులర్ అఫెండర్‌గా మారాడు. 2007 నుంచి 2012 వరకు వంశీకృష్ణ.. విజయవాడ, హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో మొత్తం 32 ఇళ్లలో చోరీలకు పాల్పడి మూడుసార్లు జైలుకు వెళ్ళాడు.

2012లో విడుదలైన తర్వాత వంశీకృష్ణ గుంటూరు నందనవనం కాలనీలో ఖరీదైన డూప్లెక్స్ ఇంటిని అద్దెకు తీసుకుని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. గుంటూరు నుంచి ఖరీదైన కార్లలో తిరిగే వంశీకృష్ణ ముందుగా సంపన్నులు ఉండే నివాస ప్రాంతాలలోని తాళం ఉన్న ఇంటిని గమనిస్తాడు.

కారు ఆపి అక్కడ సెల్‌ఫోన్ మాట్లాడుతున్నట్లు నటిస్తూ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఓ చిన్న కటింగ్ ప్లేయర్‌తో సెకన్లలోనే తాళాన్ని కట్ చేసి నిమిషాల్లో మొత్తం దోచేస్తాడు. తిరిగి ఫోన్ మాట్లాడుతూనే బయటికి వచ్చి కారులో ఎక్కి చెక్కేస్తాడు. ఇక్కడ విశేషం ఏంటంటే వంశీకృష్ణ మాట్లాడే సెల్‌ఫోన్‌లో సిమ్ ఉండదు. తాజాగా వంశీకృష్ణ సైబరాబాద్ పరిధిలో 18, హైదరాబాద్ పరిధిలో 6, విజయవాడ పరిధిలో 5 చోరీలు చేసినట్లు అంగీకరించాడు.

విలాసవంతమైన జీవితం

మిక్కిలి వంశీకృష్ణ విలాసంతవమైన జీవితం సెలబ్రిటీలను తలపిస్తుంది. బ్రాండెడ్ కంపెనీల కారులు వాడుతూ దర్జాగా పోలీసుల ముందు నుంచే దాదాపు నాలుగు సంవత్సరాలుగా తిరుగుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చోరీ ఒక దగ్గర చేసి మరో ప్రాంతంలో వాటిని అమ్మేసి గోవా, పాండిచ్చేరీలో అత్యంత విలాసవంతంగా గడిపాడని పోలీసు దర్యాప్తులో తేలింది.

ఇలా మిక్కిల వంశీ కృష్ణ మూడుకు పైగా కార్లను తన ఇంటి ముందు నిలిపేవాడు. మరికొన్ని సందర్భాల్లో తన దర్జాను చూపించుకునేందుకు ప్రైవేటు గన్‌మెన్‌లను కూడా పెట్టుకుని తిరిగే వాడని తెలిసింది. అతని నుంచి మొత్తం రెండున్నర కేజీల బంగారంతోపాటు హుండాయ్ అకార్డ్ కారు, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

రూ. కోటి సొత్తు స్వాధీనం

రూ. కోటి సొత్తు స్వాధీనం

కారులో వచ్చి క్షణాల్లో దొంగతనాలు చేసి పరారయ్యే ఓ ఖరీదైన దొంగను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అతడ్ని విచారించగా మరో 29 చోరీ కేసుల వివరాలు కూడా బట్టబయలయ్యాయి. ఈ దొంగ నుంచి పోలీసులు దాదాపు 77 లక్షలు విలువ చేసే సోత్తును స్వాధీనం చేసుకున్నారు.

పోలీసు అధికారులు

పోలీసు అధికారులు

ఇది ఇలా ఉండగా, మరో కరుడుఘట్టిన దొంగ జాకీ చాన్ అలియాస్ మేకల వెంకటేష్‌ను పట్టుకున్న పోలీసులు.. అతడి నుంచి 15 లక్షలపై సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసులలో సైబరాబాద్ పోలీసులు కోటి రుపాయల విలువైన సొత్తును రికవరీ చేశారు.

కారు, బైక్ స్వాధీనం

కారు, బైక్ స్వాధీనం

సైబరాబాద్ క్రైం డీసీపీ నవీన్‌కుమార్ బుధవారం ఈ కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

వివరాలు వెల్లడిస్తూ..

వివరాలు వెల్లడిస్తూ..

ఆంధ్రప్రదేశ్ వట్టేపాలెంకు చెందిన మిక్కిలి వంశీకృష్ణ అలియాస్ లోకేష్ 2006 నుంచి తాళం ఉన్న ఇళ్ళలో చోరీలు చేస్తున్నాడు. అప్పట్లో 11 హెచ్‌బీ కేసులలో సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు.

దొంగల ఫొటోలు

దొంగల ఫొటోలు

జైలు జీవితం అనుభవించినప్పటికీ అతనిలో మార్పురాలేదు. అంతేగాక, వంశీకృష్ణ రెగ్యులర్ అఫెండర్‌గా మారాడు.

సొత్తు స్వాధీనం

సొత్తు స్వాధీనం

2007 నుంచి 2012 వరకు వంశీకృష్ణ.. విజయవాడ, హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో మొత్తం 32 ఇళ్లలో చోరీలకు పాల్పడి మూడుసార్లు జైలుకు వెళ్ళాడు.

గొల్ల గ్యాంగ్ లీడర్ జాకీచాన్ అరెస్ట్

పేరుమోసిన పెద్దింటి గొల్ల గ్యాంగ్‌కు చెందిన సభ్యుడు మేకల వెంకటేష్ అలియాస్ జాకీ చాన్ సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా సంగెంకు చెందిన వెంకటేష్ తన 15వ యేట నుంచి చోరీలను ప్రారంభించాడు. తండ్రి , కుటుంబ పెద్దల ప్రభావం కారణంగా జాకీచాన్ 2005 నుంచి దోపిడీలకు పాల్పడ్డాడు.

గతంలో వెంకటేష్ 18 దోపీడీ కేసులలో కర్నూలు జిల్లా పోలీసులకు దొరికాడు. 2007లో జైలు నుంచి వస్తూ తప్పించుకున్నాడు. మరో మూడు డెకాయిట్ కేసులకు పాల్పడి 2008లో కర్నూలు పోలీసులకు చిక్కాడు. మరోసారి 2012లో చర్లపల్లి జైలు ఎస్కార్ట్ నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న జాకీచాన్ బెంగళూరు ఉంటూ ఓ ముఠాను ఏర్పాటు చేశాడు.

కాగా, ఈ గ్యాంగ్ అర్ధరాత్రి నిర్మానుష్య ప్రాంతాల్లోని భవనాలను లక్ష్యంగా చేసుకుంటారు. పెద్దబండరాళ్లతో ఇంటి తలుపులను బద్దలుకొడతారు. మగవారిని తాళ్ళతో కట్టేసి దోచేస్తారు. మహిళలను భయపెట్టి నోరు మూయిస్తారు. దోపిడీకి వెళ్ళే ముందు ఈ గ్యాంగ్ సభ్యులు లుంగీ కట్టుకుంటారు. నడుముకు ఓ చిన్న టవల్‌లో కంకర రాళ్ళను పెట్టుకుంటారు. అడ్డొస్తే వీటితో దాడి చేస్తారు.

2012 నుంచి మేకల వెంకటేష్ మొత్తం ఆంధ్రప్రదేశ్(4), తెలంగాణ(3), కర్నాటక(2) ప్రాంతాల్లో 9 దోపీడీలకు పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది. జాకీచాన్ నుంచి 50 తులాల బంగారం ఆభరణాలు కలుపుకుని 15 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగలను పట్టుకున్న ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసు సిబ్బందిని సైబరాబాద్ సీపీ ఆనంద్ ప్రత్యేకంగా అభినందించారు.

English summary
Cyberabad police finally arrested ‘Jackie Chan’, a notorious burglar, who escaped twice from cops using his acrobatic skills. The burglar, whose real name is Mekala Venkatesh, had been avoiding the police for four years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X