నేను చస్తేనే నిధులు ఇస్తారా : ఎమ్మెల్యే అనిరుధ్‌ సంచలనం..!!

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే అనిరుధ్ ఇప్పుడు తన నియోజకవర్గానికి నిధుల పైన హెచ్చరిక చేయటం సంచలనంగా మారుతోంది. గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తో సహా పలు అంశాల పైన అనిరుద్ తీవ్రంగా స్పందించారు. కాగా.. ఇప్పుడు ప్రభుత్వం తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వాలని కోరుతూనే హెచ్చరిక చేసారు. నిరాహార దీక్షకు సిద్దమని ప్రకటించారు. దీంతో.. అనిరుధ్ ప్రభుత్వానికి ఇచ్చిన వార్నింగ్ సంచలనంగా మారుతోంది.

కాంగ్రెస్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వైరల్ అవుతున్నాయి. అనిరుధ్ గతం లోనూ పలు వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు అనిరుధ్‌ రెడ్డి నిధుల విడుదలలో జాప్యం విషయంలో సర్కార్‌పై తనదైన శైలిలో చురకలంటించి చర్చక కారణమయ్యారు. నియోజకవర్గం కోసం తాను దేనికైనా సిద్దం అని అనిరుధ్ చెబుతూనే.. ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వటం సొంత పార్టీలోనే చర్చగా మారుతోంది. నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో అనిరుధ్ రెడ్డి తాను ఎప్పటి నుంచో నియోజకవర్గంలో రోడ్లకు నిధులు కోరుతున్న విషయాన్ని గుర్తు చేసారు. వీటిని సాధించేందుకు నియోజకవర్గంలో 30 వేల మందితో చనిపోయే వరకూ దీక్ష చేస్తానని ప్రకటించారు. నిధులు ఇవ్వాల్సిందేనని.. రోడ్లు పూర్తి చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. మనకు రోడ్లు ఇచ్చింది ఎవరు..? నా గురువు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆయననే అడుగుతున్నా.. అన్నా కొబ్బరికాయకొట్టి పోయినవ్‌ .. పూర్తి చేయాలి అని వ్యాఖ్యానించారు.

భయపెడుతున్న తుఫాన్, అత్యంత భారీ వర్షాలు- ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!!
భయపెడుతున్న తుఫాన్, అత్యంత భారీ వర్షాలు- ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!!
jadcherla-mla-anirudh-reddy-vows-to-sit-on-indefinite-protest-with-30-000-people-details-here

వైరల్ అవుతున్న అనిరుధ్ వ్యాఖ్యలు

అదే విధంగా డిప్యూటీ సీఎం తన నియోజకవర్గంలో పాదయాత్రకు వస్తే నాడు 30 వేల మందితో సభ ఏర్పాటు చేసానని గుర్తు చేసారు. తన నియోజకవర్గంకు బిల్లులు ఇవ్వాలని.. లేకుంటే నేను ఆమరణ నిరాహాక దీక్షకు కూర్చొంటానని.. చనిపోతున్నా నిధులు ఇవ్వరా అని ప్రశ్నించారు. ఇక అనిరుధ్‌ రెడ్డి చచ్చిపోతెనే జడ్చర్లకు నీళ్లు ఇస్తామంటే.. తాను అమరణ నిరాహార దీక్షలో చచ్చి పోతానంటూ ఎమోషనల్ అయ్యారు. మరి రూ.40 కోట్లు విలువనా..? లేదా నా ప్రాణం విలువనా..? అనేది మా ప్రభుత్వం నిర్ణయించుకోవాలని ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. జడ్చర్లలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి నియోజకవర్గానికి కావాల్సినవి సాధించుకుందామని అనిరుధ్ చెప్పుకొచ్చారు. కాగా.. అనిరుధ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+