మోడీకి జగన్ అభినందనలు : చంద్రబాబు కూడా, వాళ్లందరికీ కవిత..
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడడంతో, గెలిచిన పార్టీల అధినేతలకు ఆయా నేతల నుంచి అభినందనలు పోటెత్తుతున్నాయి. తాజాగా ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత గెలిచిన పార్టీలకు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.
అస్సాంలో కాంగ్రెస్ కి జలక్ ఇస్తూ.. స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతున్న బీజేపీని జగన్ అభినందించారు. ' అస్సాంలో తిరుగులేని విజయం సాధించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి అభినందనలు' అంటూ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు జగన్.
అలాగే తమిళనాట విజయ ఢంకా మోగించిన జయలలితకు, బెంగాల్ లో మరోమారు అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న దీదీ మమతా బెనర్టీకి, కేరళలో విజయం సాధించిన ఎల్.డీ.ఎఫ్ పార్టీకి ట్విట్టర్ ద్వారా జగన్ అభినందనలు తెలియజేశారు.
Congratulations to @narendramodi ji #BJP for leading the party to a resounding victory in #AssamPolls2016.
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 19, 2016
Congrats to LDF on their impressive victory in #KeralaPolls2016
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 19, 2016
Hearty congratulations and best wishes, MamathaDidi, on your thumping victory. #WestBengalPolls2016
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 19, 2016
Congratulations to Puratchi Thalaivi Jayalalithaa for victory in #TNElection2016
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 19, 2016
దీదీకి కంగ్రాట్స్ : ఎంపీ కవిత
హైదరాబాద్ : తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత తాజా ఎన్నికల ఫలితాలపై ట్విట్టర్ లో స్పందించారు. కేరళలో ఘన విజయం సాధించిన ఎల్.డీ.ఎఫ్ కి, బెంగాల్ లో మళ్లీ పాగా వేసిన మమతా బెనర్జీకి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు.
Heartiest congratulations to Shri #Achuthanandan ji for impressive performance and victory in Kerala
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 19, 2016
Heartiest congratulations to #MamataBanerjee ji for her consecutive victory in West Bengal
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 19, 2016
చంద్రబాబు అభినందనలు..
విజయవాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా తాజా ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన చంద్రబాబు, అస్సాంలో చారిత్రాత్మక విజయం సాధించారంటూ మోడీని అభినందించారు. అలాగే బెంగాల్, తమిళనాడులో వరుసగా రెండు సార్లు అధికారాన్ని చేజిక్కుంచుకున్న దీదీ మమతా బెనర్జీ, జయలలితలకు కూడా అభినందలు తెలియజేశారు.
Congratulations and best wishes to Mamata Banerjee @MamataOfficial for winning in West Bengal.
— N Chandrababu Naidu (@ncbn) May 19, 2016
Congratulations and best wishes to @BJP4India for the historic win in #Assam.
— N Chandrababu Naidu (@ncbn) May 19, 2016












Click it and Unblock the Notifications