చిరంజీవి, పవన్ కళ్యాణ్‌పై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో రుణమాఫీ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రముఖ సినీనటులు మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కాంగ్రెస్ ప్రాక్టికల్ పార్టీ అని.. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశారని చెప్పారు.

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బటన్ నొక్కితే సీఎం రేవంత్ రుణమాఫీ చేశారన్నారు జగ్గారెడ్డి. రుణమాఫీ చేయడం చూసి బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టి ఉండదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్‌కు ట్విట్టర్ పని తప్ప.. పనికి పనికిరాడని విమర్శించారు. బీజేపీ దగ్గర మాటలు
తప్పితే.. పనితనమే లేదని విమర్శించారు. బీజేపీ రైతులను చంపిందని ఆరోపించారు.

Jagga Reddy fires at Chiranjeevi and Pawan Kalyan for supporting Modi BJP

బీజేపీ నేతల పిల్లలు రైతుల మీద నుంచి కార్లు తీసుకుపోయారని.. దీనిపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడగలరా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఎండనకా.. వాననకా రైతులు ధర్నా చేస్తే బీజేపీ నేతలు చంపలేదా? అని అన్నారు. రాహుల్ గాంధీ ప్రాక్టికల్ మనిషి.. వాస్తవాలకు దగ్గరగా ఉంటారని జగ్గారెడ్డి తెలిపారు. సోనియా గాంధీ కుటుంబానికి ఉన్న గొప్పతనం అదేనని అన్నారు.

రాహుల్ గాంధీ సినిమాలో హీరోల లాగా నటించలేదని.. దేశం అంతా కాలినడకన నడిచారని జగ్గారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినిమాల్లో రైతుల గురించి చూపించి చిరంజీవి డబ్బులు సంపాదించుకున్నారని విమర్శించారు.

రైతుల నష్టాలపై సినిమాలు తీసే చిరంజీవి.. బీజేపీ తీసుకొచ్చిన నల్ల చట్టాలపై ఎందుకు మాట్లాడలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రైతుల కష్టాలపై సినిమాలు తీసే మీరు(చిరంజీవి).. రైతుల ప్రాణాలు తీసిన బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారన్నారు. రైతుల మీద సినిమా తీస్తే.. కోట్ల రూపాయులు నీకు, నీ డైరెక్టర్‌కు వచ్చాయి.. నీ సినిమా రైతు కడుపు నింపిందా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నల్ల చట్టాలు తెచ్చిన నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చి.. రైతులకు అండగా ఉన్న రాహుల్ గాంధీకి మద్దతు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 'నువ్వు(చిరంజీవి), నీ తమ్ముడు పవన్ కళ్యాణ్.. బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నారంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+