జైల్లో పెట్టడం సహా కేసీఆర్ వల్ల నాకు మంచి జరిగింది, అంతా హరీష్ రావే: జగ్గారెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విషయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వల్ల తనకు రెండుసార్లు మంచి జరిగిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని పెట్టిన కొత్తలో తాను ఎమ్మెల్యే అయ్యానని చెప్పారు.

 జైల్లో పెట్టడంతో రెండో మంచి జరిగింది

జైల్లో పెట్టడంతో రెండో మంచి జరిగింది

తనను జైల్లో పెట్టడంతో తన రాజకీయ వారసురాలిని తెరపైకి తెచ్చానని జగ్గారెడ్డి చెప్పారు. కేసీఆర్ కుటుంబంతో తనకు ఎలాంటి రాజకీయ వైరం లేదని తేల్చి చెప్పారు. విభేదం అంతా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతోనే అని చెప్పారు. అసలు తనను జైల్లో పెట్టించింది హరీష్ రావే అని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పైన తాను ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు చేయలేదని చెప్పారు.

కేటీఆర్ పైన పొగడ్త, హరీష్ రావుపై విమర్శలు

కేటీఆర్ పైన పొగడ్త, హరీష్ రావుపై విమర్శలు

కానీ హరీష్ రావు మాత్రం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తారని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చాలా నిజాయితీ కలిగిన నేత అని పొగడ్తలు కురిపించారు. అదే సమయంలో ఆయన తన సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. లాబీయింగ్ చేసేవాళ్లకే తమ పార్టీలో పదవులు ఉంటాయని ఆరోపణలు చేశారు. తనలాంటి వాళ్లకు లాబీయింగ్ చేసేవాళ్లు లేరన్నారు.

 కాంగ్రెస్ పార్టీలో ఎదగాలనే కసి లేదు

కాంగ్రెస్ పార్టీలో ఎదగాలనే కసి లేదు

కాంగ్రెస్ పార్టీలో ఉన్నతస్థాయికి ఎదగాలన్న కసి తనకు లేదని జగ్గారెడ్డి చెప్పారు. ఇక్కడ ఇబ్బంది పడుతున్న నాయకులకు తమ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ భరోసా ఇవ్వాలని చెప్పారు. కాగా, జగ్గారెడ్డి తెరాస గెలిచిన కొత్తలో కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నాలుగేళ్ల పాటు కేసీఆర్ పాలన గురించి మాట్లాడనని చెప్పారు. తన నియోజకవర్గం అభివృద్ధి కోసం వారి అవసరం ఉందని కూడా చెప్పారు. అయితే తాను పార్టీ మారేది లేదని చెప్పారు. ఇప్పుడు వారిపై ప్రశంసలు కురిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+