జగ్గారెడ్డి అరెస్ట్: సంగారెడ్డిలో ఉద్రిక్తత

మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.సంగారెడ్డి జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ జగ్గారెడ్డి తలపెట్టిన ఆమరణ నిరాహారదీక్షను అడ్డుకున్నారు.

సంగారెడ్డి: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తలపెట్టిన ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయన్ను అరెస్టు చేసి జోగిపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

కలెక్టరేట్ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు ఆయన తన ఇంటినుంచి కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరగా పోలీసులు ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు.

jaggareddy arrested in Sangareddy

ఈ సందర్బంగా పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ప్రస్తుతం జగ్గారెడ్డిని అరెస్టు చేసి జోగిపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసు బలగాలు చేరుకోవడంతో సంగారెడ్డిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+