వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ కు పాదాభివందనం చేస్తున్నా...ఐఎఎస్ ల తీరుపై విమర్శలు,ఎందుకిలా?

జగిత్యాల కలెక్టర్ శరత్, మెట్ పల్లి సబ్ కలెక్టర్ ముషారఫ్ అలీ గణతంత్రదినోత్సవ వేడుకల్లో వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. ఈ విషయమై సోషల్ మీడియాలో ఐఎఎస్ ల తీరును తప్పుబడుతున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

జగిత్యాల:జగిత్యాల కలెక్టర్ శరత్ వ్యవహరశైలి వివాదాస్పదమైంది. గణతంత్రదినోత్సవ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ఈ వివాదానికి కారణమైంది. కలెక్టర్ తో పాటు మెట్ పల్లి సబ్ కలెక్టర్ ముషరఫ్ అలీ తీరుపై కూడ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల కలెక్టర్ శరత్ చేసిన ప్రసంగం విమర్శలకు తావిచ్చింది.జగిత్యాల జిల్లాలో తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు పాదాభివందనం చేస్తున్నా అంటూ ఆయన చేసిన ప్రసంగం పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం కెసిఆర్ కు పాదాభివందనం చేస్తున్నా అంటూ కలెక్టర్ శరత్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

jagityala collector sharat controversy comments

జగిత్యాల జిల్లా అభివృద్దికి పాటుపడుతున్న నిజామాబాద్ ఎంపి కవితకు శుభాభివందనాలు అంటూ ఆయన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

జాయింట్ కలెక్టర్ కూడ
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విఐపి గ్యాలరీ లో కూర్చొన్న నిజామాబాద్ ఎంపి కవిత వద్దకు మెట్ పల్లి సబ్ కలెక్టర్ ముషరఫ్ అలీ ఆమెతో మాట్లాడారు.

అయితే ఆమె ముందు మోకాళ్లపై కూర్చొని జాయింట్ కలెక్టర్ మాట్లాడడం కూడ విమర్శలకు తావిచ్చింది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ల తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

English summary
jagityala collector sharat controversy comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X