ఎలా వచ్చింది: జైల్లో 'సత్యం' రాజు వద్ద సెల్‌ఫోన్
హైదరాబాద్: సత్యం స్కాంలో అరెస్టై జైలులో ఉన్న సత్యం రామలింగ రాజు వద్ద ఉన్న సెల్‌ఫోనును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చర్లపల్లి జైలులో ఉన్న రామలింగ రాజు వద్ద సెల్‌ఫోన్ ఉంది. దానిని గురువారం ఉదయం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రామలింగ రాజు గోదావరి బ్యారక్‌లో ఉంటున్నాడు. ఈ రోజు జైళ్ల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతని వద్ద సెల్‌ఫోన్, రెండు సిమ్ కార్డులు గుర్తించారు. దీంతో జైలు అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అవి జైలులోకి ఎలా వచ్చాయనే అంశంపై దర్యాఫ్తు చేస్తున్నారు.
జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ వద్దకు సెల్ ఫోన్ ఎలా వచ్చిందనే అనుమానాలు దుమారం రేపుతున్నాయి. గతంలో గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న యాదగిరి రావు వద్ద కూడా సెల్ ఫోన్ దొరికింది.

సత్యం కుంభకోణం కేసులో రామలింగ రాజు సహా పదిమందికి జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. అతనికి ఏడేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధించారు. అతనిని చర్లపల్లి జైలుకు తరలించారు.
జైలులో ఉన్న ఖైదీలు ఇటీవల క్రికెట్ అడారు. అప్పుడు రామలింగ రాజు మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. ఇతర ఖైదీలు క్రికెట్ ఆడుతుంటే, ఆయన మాత్రం మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. చర్లపల్లి జైలులో ఇటీవల తొలిసారి ట్వంటీ20 క్రికెట్ నిర్వహించారు. ఈ మ్యాచ్‌కు రామలింగ రాజు సహా సత్యం కేసు దోషులు దూరంగా ఉన్నారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications