Jailer: రజినీకాంత్ రెమ్యూనరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్..!
హైదరాబాద్ : గతవారం రెండు భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మరొకటి మెగాస్టార్ నటించించిన భోళా శంకర్. జైలర్ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించినా... భోళా శంకర్ మాత్రం బిగ్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మధ్యే హీరోల రెమ్యూనరేషన్ అంశం తెలుగురాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. అంతేకాదు హీరోలు వారు నటించే సినిమాలకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి సగటు సినీ ప్రేక్షకుడికి కూడా ఉంటుంది. అందుకే జైలర్ చిత్రానికి గాను ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం.
సూపర్ స్టార్ రజినీకాంత్ తమన్నా జంటగా నటించిన చిత్రం జైలర్ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. అయితే రజినీ కంటే తమన్నా "కావాలయ్యా" సాంగ్‌కు వేసిన స్టెప్పు ఆ సినిమాకు మరింత గ్రేస్‌ను తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో ఆ సాంగ్ తెగ వైరల్ అయ్యింది. వరుస ఫ్లాప్‌ల తర్వాత రజినీకాంత్ ఒక హిట్ సినిమాతో వచ్చాడు. రజినీకాంత్‌తో పాటు ఈ చిత్రంలో నటించిన ఇతర స్టార్స్ కూడా డబ్బులు బాగానే తీసుకున్నట్లు సమాచారం. ఇంతకీ ఎవరెవరు ఎంత తీసుకున్నారు..?

రజినీ రెమ్యూనరేషన్
ఏడుపదుల వయసులోను రజినీకాంత్ కుర్రహీరోలతో పోటీపడి తన స్టయిల్‌లో జైలర్ సినిమాలో రంజింపచేశాడు. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన జైలర్ చిత్రంలో మోహన్‌లాల్, జాకీష్రాఫ్, శివరాజ్‌కుమార్‌లు ఇతర కీలకపాత్ర పోషించారు. ఇండియన్ సినిమాలో అత్యంత భారీ పారితోషికం తీసుకుంటున్నవారిలో రజినీకాంత్ ఒకరు. ఇక 169వ చిత్రమైన జైలర్‌కు రజినీ రూ.110 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు జీక్యూ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.

మోహన్‌లాల్, తమన్నా, శివరాజ్‌కుమార్‌ల పారితోషికం
ఇక మలయాళం నటుడు మోహన్‌లాల్ ఈ చిత్రంలో సడెన్ సర్ప్రైజ్ ఇచ్చాడు.63 ఏళ్ల వయసులో కూడా తన స్టామినా ఏంటో చూపించాడు మోహన్‌లాల్. జైలర్ చిత్రంలో నటించినందుకుగాను మోహన్‌లాల్ రూ.8 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్లు జీక్యూ రిపోర్ట్ పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో రజినీ సరసన నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా రూ.3 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.ఇదే చిత్రంలో నటించిన జాకీష్రాఫ్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్‌లు చెరో రూ.4 కోట్లు రెమ్యూనరేషన్‌గా అందుకున్నట్లు సమాచారం.

రమ్యకృష్ణ రేంజ్‌కు తక్కువే
కమేడియన్ యోగిబాబు రూ.1 కోటి పారితోషికంగా తీసుకోగా, రమ్య కృష్ణ రూ.80 లక్షలు రెమ్యునరేషన్ పొందినట్లు సమాచారం. జైలర్ ముత్తువేల్ పాండియన్ క్యారెక్టర్‌లో రజినీకాంత్ నటించారు. జైలు నుంచి తమ నాయకుడిని ఎలాగైనా తప్పించాలని ఓ క్రిమినల్ గ్యాంగ్ ప్లాన్ చేస్తుంది. అయితే వీరి ప్రయత్నాలను జైలర్ ఎలా అడ్డుకట్ట వేశాడు ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు కొనితెచ్చుకున్నాడు అనే లైన్‌పై కథ సాగుతుంది. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన జైలర్ చిత్రం విమర్శకుల నుంచి కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా 7వేల స్క్రీన్స్‌లో చిత్రం విడుదలైంది. ఈ చిత్రం బడ్జెట్ రూ.200 కోట్లని సమాచారం.












Click it and Unblock the Notifications