నా స్టైల్ నాదే: జానా, దేవుడు హర్షించడు: డికె అరుణ
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేతగా తన శైలిలోనే తాను వ్యవహరిస్తానని, తనను వేరొకరితో పోల్చడం తగదని కాంగ్రెసు నేత, ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి అన్నారు . తన స్థాయికి తగినట్లుగా హుందాగా వ్యవహరిస్తానని, ప్రభుత్వంపై తనది మెతక వైఖరి అనడం సరి కాదని ఆయన అన్నారు. ఎవరి కోసమో తాను దూకుడుగా వ్యవహరించబోనని స్పష్టం చేశారు.
శానససభ్యులు, ఎమ్మెల్సీల ఫిరాయింపులపై స్పీకర్, చైర్మన్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై తాము న్యాయ పోరాటం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సిఎల్పీలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని ఆయన చెప్పారు. మంత్రి జగదీష్ రెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణల మీద ప్రభుత్వం స్పందించాలని ఆయన కోరారు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెసు అభ్యర్థులు బీ ఫారాలు తీసుకున్నారు. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ నుంచి రవికుమార్ గుప్తా బీ ఫారమ్ అందుకోగా, నల్లగొండ - ఖమ్మం - వరంగల్ నుంచి తీన్మార్ మల్లన్న బీ ఫామ్ అందుకున్నారు. వీరికి గాంధీభవన్‌లో ఎఐసిసి నేత కుంతియా భీ పారాలు అందించారు.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయ్యాయని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రజలను మభ్యపెడుతున్నాయని అన్నారు.
ప్రభుత్వ నిధులతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దేవుళ్లకు మొక్కులు చెల్లించడాన్ని కాంగ్రెసు నేత డికె అరుణ తప్పు పట్టారు. ప్రభుత్వ డబ్బులతో మొక్కులు తీర్చుకుంటే దేవుళ్లు కూడా హర్షించరని ఆమె అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యక్తిగత మొక్కులు చెల్లించడం కోసం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టడం విడ్డూరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీ.కె.అరుణ విమర్శించారు. కేసీఆర్ పద్దతి చూస్తుంటే తన కోరిక తీరితే పక్కవాడి తలవెంట్రుకలు ఇస్తానని మొక్కుకున్నట్టు ఉందని ఆమె ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications