పవన్ కల్యాణ్ ఫ్యాన్, జనసేన సభ్యుడు, టెక్కీ: ఫేస్‌బుక్కుతో యువతితో చెలగాటం

హైదరాబాద్: ఓ యువతిని వేధిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీరును హైదరాబాదు పోలీసులు అరెస్టు చేశారు. సినీ హీరో, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు అతను వీరాభిమాని కావడమే కాకుండా జనసేన పార్టీలో క్రియాశీల సభ్యుడు. విశాఖపట్నంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు.

ఫేస్‌బుక్‌లో అమ్మాయిలను పరిచయం చేసుకోవడం, మాయమాటలతో ఆ పరిచయాన్ని స్నేహం వరకు తీసుకురావడం, ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ మెయిల్ చేయడం వంటి చర్యలకు అతను పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్‌మీడియాలో బెదిరింపులకు పాల్పడటం, ఇదేరకమైన చేష్టలపై అందిన ఫిర్యాదుతో సీసీఎస్ సైబర్‌క్రైమ్ విభాగం పోలీసులు రంగంలోకి దిగి అతన్ని పట్టుకున్నారు.

Techie Chandrasekhar

పోలీసులు తెలిపిన ప్రకారం.. విశాఖపట్టణానికి చెందిన చంద్రశేఖర్ సాకేటి అక్కడే సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాదు నగరానికి చెందిన ఒక యువతితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. తరుచుగా ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేసేవారు. ఆ క్రమంలో పరిచయం స్నేహంగా మారడంతో సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసుకొన్నాడు. హైదరాబాద్‌కు వచ్చినప్పడల్లా కలువమని బలవంతం చేసేవాడు. యువతి తొలుత నిరాకరించినా.. ఆ తర్వాత ఒకట్రెండుసార్లు కలుసుకొన్నారు.

Jana Sena activist and Visakha techie arrested

అమ్మాయి ఇచ్చిన చనువును అవకాశంగా తీసుకొన్న చంద్రశేఖర్ మొదట ప్రేమ, ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అందుకు నిరాకరించిన ఆమె చాటింగ్ చేయడం, ఫోన్‌లో మాట్లాడటం ఆపేసింది. దాంతో హైదరాబాద్‌లో ఆమెను కలిసినప్పుడు రహస్యంగా తీసుకున్న ఫోటోలు, చాటింగ్ మేసేజ్‌లతో అసభ్యకరమైన కామెంట్లు ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తున్నాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు శేఖర్‌ను అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+