తెలంగాణపై పవన్ బిగ్ స్టెప్: రేపు హైదరాబాద్ లో జనసేన కేంద్ర కార్యాలయం ప్రారంభం

తెలంగాణలో రాజకీయ కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడానికి, మరియు సంస్థాగత బలాన్ని పెంచుకోవడానికి జనసేన పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం ఉదయం 11:08 నిమిషాలకు ఈ నూతన కార్యాలయాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నారు. ఈ పరిణామం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనసేన శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతోంది.

హైదరాబాద్ కేం‍ద్రంగా సొంత పార్టీ కార్యాలయం అందుబాటులోకి రావడం వల్ల తెలంగాణలో పార్టీ పటిష్టతకు మరింత మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కమిటీ సభ్యులు, కార్యకర్తలు తమ కార్యకలాపాలను ఇకపై ఇక్కడి నుంచే సమన్వయం చేసుకోనున్నారు. నాయకులు, జనసైనికులు, వీర మహిళలు కలిసికట్టుగా పనిచేసేందుకు ఈ కార్యాలయం ఒక ప్రధాన కేంద్రంగా ఉపయోగపడనుంది.

Jana Sena New Telangana State Office Inauguration in Hyderabad On June 19 Join the Celebration

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌ మణికొండలో జనసేన పార్టీ తెలంగాణ కేంద్రం కార్యాలయం ఏర్పాటైంది. మల్కం చెరువు సమీపంలో గల ప్లాట్ నంబర్ 8-1-246/2 చిరునామాలో ఈ నూతన భవన సముదాయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నగర నడిబొడ్డున ఉండటంతో పాటు రవాణా పరంగా అన్ని జిల్లాల వారికి సులభంగా చేరుకునేలా ఈ ప్రదేశాన్ని ఎంపిక చేయడం విశేషం. దీని ప్రారంభోత్సవానికి సంబంధించి పార్టీ వర్గాలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాయి.

ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులకు జనసేన నాయకత్వం సాదరంగా ఆహ్వానం పలికింది. అన్ని జిల్లాల నుంచి జనసైనికులు, వీరమహిళలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్రారంభోత్సవ వేడుకను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు స్థానిక సమన్వయకర్తలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

గత కొద్ది కాలంగా తెలంగాణాలో జనసేన పార్టీ తన ఉనికిని మరింత బలంగా చాటుకోవడానికి నిశ్శబ్దంగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ నూతన కార్యాలయ ప్రారంభంతో క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదుల నిర్వహణ, జిల్లాల వారీగా నూతన కమిటీల నియామకం, ప్రజా సమస్యలపై పోరాటాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి కీలకమైన రాజకీయ నిర్ణయాలన్నీ ఇకపై ఈ కార్యాలయం వేదికగానే జరగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+