ఈ కార్పోరేషన్లలో పోటీ చేస్తున్నాం- జనసేన ప్రకటన..!!
జనసేన కీలక ప్రకటన చేసింది. వచ్చే ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తాము బరిలోకి దిగుతున్నామని వెల్లడించింది. పార్టీ పోటీ చేసే కార్పోరేషన్ల జాబితా ప్రకటించింది. తాము ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈ పోటీ నిర్ణయం లో మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని వెల్లడించింది. ఇక, ఇప్పుడు జనసేన నిర్ణయంతో కార్పోరేషన్ ఎన్నికల వేళ కొత్త రాజకీయ సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. అసలు రాజకీయం మొదలైంది.
ఏపీలో ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న జనసేన తెలంగాణలో ఎన్నికల బరిలోకి ఒంటరిగానే దిగాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా గ్రేటర్ పరిధిలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నామని జనసేన అధికార ప్రతినిధి తళ్లూరి రామ్ వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ బలంగా పోటీ చేస్తుందని వెల్లడించారు. కొద్ది నెలల క్రితం తెలంగాణలో పోటీ పైన జనసేనాని పవన్ కీలక ప్రకటన చేసారు. అందులో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ బలంగా పోటీ చేస్తుందని ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ స్పష్టం చేశారు. గ్రేటర్ జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు.

తెలంగాణలో ఒంటరి పోరుకు సిద్దం
జనసేన పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తళ్లూరి రామ్ నిర్దేశించారు. ఇదే సమయంలో పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన బలోపేతం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి సము చిత స్థానం దక్కుతుందని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయ భవితవ్యానికి ఈ ఎన్నికలే దిక్సూచి కానున్నాయని ప్రచార కార్యదర్శి సాగర్ ఆర్‌కే నాయుడు పేర్కొన్నారు. ఇక్కడ వచ్చిన ఫలితాలే రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఆయన అన్నారు. అయితే.. ఇప్పటికే వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు పేరును జనసేన ప్రకటించింది. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడంతో తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపై జనసేన అధిష్ఠానం సీరియస్‌గా దృష్టి సారించినట్లు విశ్లేషణలు మొదలయ్యాయి.













Click it and Unblock the Notifications