సరిహద్దు ప్రాంతాల్లో పేలిన మందుపాతర: పోలీసు మృతి
భూపాలపల్లి: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి 18 మంది పోలీసులకు తీవ్రగాయాలపాలయ్యారు. కాగా, ఒకరు మృతి చెందినట్లు సమాచారం. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా పరిధిలో మంగళవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు తెలిసింది.
ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలైనట్లు తెలిసింది. ఈ క్రమంలో బుధవారం పోలీసు బలగాలు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో గాలింపు చర్యలు చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన సీ 60 కమెండోలు 19 మంది బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో గడ్చిరోలి జిల్లా బాంబ్రిఘడ్ తాలూకా పరిధిలో సంచరిస్తుండగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.

18 మంది పోలీసులు గాయపడగా, సురేష్ అనే కమాండో మృతి చెందినట్లు సమాచారం. దీపక్, ప్రకాష్, జితేందర్ కొర్తెతోపాటు పలువురు గాయపడ్డారు. ఈ సంఘటనలో తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులో అలజడి మొదలైంది. దీంతో తెలంగాణ ప్రాంత పోలీసులు ముందస్తు భద్రత చర్యలు తీసుకుంటున్నారు. సరిహద్దు గ్రామాలు, అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబీంగ్లు నిర్వహిస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications