ఇవాంకా, నరేంద్ర మోడీ రాక: జెరూసలేం మత్తయ్య ముందస్తు అరెస్ట్
ఓటకు నోటు కేసు నిందితుడు జెరూసలేం మత్తయ్యను ఉప్పల్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం నగరంలో జరగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్ షిప్ సమ్మిట్‌కు ఇవాంకా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీ వస్తు
హైదరాబాద్: ఓటకు నోటు కేసు నిందితుడు జెరూసలేం మత్తయ్యను ఉప్పల్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం నగరంలో జరగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్ షిప్ సమ్మిట్‌కు ఇవాంకా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులు ఆపాలంటూ వారి ముందు నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని మత్తయ్య ఉప్పల్ పోలీసుల అనుమతి కోరారు.

మత్తయ్య అభ్యర్థనను పోలీసులు తిరస్కరించారు. అయితే ఆయన ఆందోళన చేసే అవకాశముందని భావించిన పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications