తెలంగాణ ప్రభుత్వాన్ని ఏకిపారేసిన గుజరాత్ యువ సంచలనం!
Recommended Video

హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగని పరామర్శించడానికి బుధవారం హైదరాబాద్ వచ్చిన జిగ్నేష్ మేవానీ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడడం సంచలనంగా మారింది.
అనుమతి లేకుండా నిరసనకు దిగిన కేసులో ఎమ్మర్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగని హైదరాబాద్ పోలీసులు నిర్బంధించడం, అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించడం తెలిసిందే.

బుధవారం జైల్లో ఉన్న మందకృష్ణను కలసిన జిగ్నేష్ సంఘీభావం వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పోలీసు రాజ్యాన్ని నడిపిస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన తీవ్ర స్థాయికి చేరుకుందని ఆయన ఆరోపించారు.
గుజరాత్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యువత్రయం హార్థిక్ పటేల్, జిగ్నేష్ మేవానీ, అల్పేష్ ఠాకూర్ ప్రధాని మోడీకే ముచ్చెమటలు పట్టించిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు యువనాయకులు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు.
జిగ్నేష్ మేవానీ గుజరాత్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే గా విజయం సాధించి ప్రస్తుతం దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్ గా మారాడు. దళిత నేత మంద కృష్ణ మాదిగని పరామర్శించడానికి బుధవారం హైదరాబాద్ వచ్చిన జిగ్నేష్ దళితుల పట్ల తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశాడు.
నాయకుడిని నిర్బంధిస్తే ఉద్యమం మరింతగా ఎగసి పడుతుందని జిగ్నేష్ మేవానీ హెచ్చరించారు. తెలంగాణలో దళిత సంఘాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం దళితులకు ఐదెకరాల భూమిని కేటాయించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. బుధవారం మందకృష్ణను కలిసిన వారి జాబితాలో సినీ విమర్శకుడు కత్తి మహేష్ కూడా ఉండడం గమనార్హం.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications