యువతిపై ప్రేమోన్మాది దాడి: నరికి చంపిన తండ్రి

హైదరాబాద్: ప్రేమించాలంటూ కొద్ది రోజులుగా వెంటపడుతున్న ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘాతుకం హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో చోటుచేసుకుంది.

రాజు అనే యువకుడు యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Jilted lover attacks girl: Her father kills him

ప్రేమోన్మాది రాజును యువతి తండ్రి నరికి చంపాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారంనాడు యువతి జన్మదినం కావడంతో రాజు గొడవకు దిగాడు.

తనను ప్రేమించడం లేదనే అక్కసుతో రాజు యువతి పెళ్లి సంబంధాలను కూడా చెడగొడుతూ వచ్చాడు. యువతి జన్మదినమని చెప్పి రాజు ఆమె ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టినట్లు చెబుతున్నారు. అందుకు ఆమె నిరాకరించడంతో రాజు కత్తితో దాడి చేసినట్లు చెబుతున్నారు. యువతితో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులను ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+