హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ ప్రేయసికి న్యూడ్ ఫోటోలు, వ్యక్తి అరెస్ట్: ప్రమాదంలో టెక్కీ మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ ప్రేయసికి అశ్లీల చిత్రాలు, అసభ్య సందేశాలు పంపుతున్న చైతన్య కుమార్‌ను సైబర్ క్రైం పోలీసులు శనివారం నాడు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన చైతన్య ఎంసీయే పూర్తి చేశాడు. కొద్ది నెలల క్రితం ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ వచ్చాడు.

ఈ క్రమంలో కాచిగూడకు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. యువతి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారు. దీంతో పెళ్లి జరగలేదు.

Jilted lover jailed for posting nude photos of ex-girl friend

యువతి పైన కక్ష పెంచుకున్న చైతన్య ఆమెకు ఫోన్ చేసి వేధించేవాడు. నెంబర్ మార్చడంతో కొద్ది రోజులు ఆగాడు. మళ్లీ ఫోన్ నెంబర్ సేకరించి అశ్లీల చిత్రాలు, అసభ్య సందేశాలు పంపుతున్నాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐటీ, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

టెక్కీ మృతి

ఆదివారం ఉదయం చింతల్ ఐడీపీఎల్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉదయం తన బైక్ పైన హైటెక్ సిటీకి వెళుతుండగా... బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

English summary
Jilted lover jailed for posting nude photos of ex-girl friend
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X