ప్రేమోన్మాది ఘాతుకం: నడిరోడ్డులో యువతిపై పెట్రోల్ పోసి.. నిప్పంటించి..

Posted By:
Subscribe to Oneindia Telugu
  నడిరోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమికుడు ! మామూలుగా కాదు, ఘోరం !

  హైదరాబాద్: సికింద్రాబాద్ లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రేమోన్మాది తనను ప్రేమించలేదనే కోపంతో ఓ యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఆ యువతి తీవ్రంగా కాలి గాయపడింది.

  స్థానిక శాంతినగర్‌లోని లక్కీ ట్రేడర్స్‌లో పనిచేస్తోన్న సంధ్యారాణి(22) అనే యువతి గురువారం లాలాగూడలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

  girl-burnt-alive

  ప్రేమిస్తున్నానంటూ ఏడాదిగా ఆమె వెంటబడుతున్న కార్తీక్ అనే యువకుడు బైక్‌పై వచ్చి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో సంధ్యారాణి ఒళ్లు 70 శాతానికి పైగా కాలిపోయింది.

  స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం ఆమెను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు కారణమైన ప్రేమోన్మాది కార్తీక్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A lover, Karthik poured petrol on his lover Sandhyarani and set her on fire on Thursday at Secunderabad Lalaguda while she going on road. Sandhya Rani is working in Lucky Traders which is located in Shanti Nagar.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి