తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి
తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎంపీ, ప్రభుత్వ క్రీడాశాఖ సలహదారు జితేందర్ రెడ్డి విజయం సాధించారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడి స్థానానికి జితేందర్ రెడ్డి తోపాటు తెలంగాణ బ్యాడ్మింటన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఉపాధ్యక్ష పదవికి కూడా చాముండేశ్వరి నాథ్ నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం.
ఈ క్రమంలో జరిగిన తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో క్రీడాశాఖ సలహాదారుడుగా వ్యవహరిస్తున్న జితేందర్ రెడ్డి విజయం సాధించారు. ప్రత్యర్థి చాముండేశ్వరి నాథ్‌పై 34 ఓట్ల తేడాతో జితేందర్ రెడ్డి గెలుపొందారు.

ఈ ఎన్నికల్లో జితెందర్ రెడ్డికి 43 ఓట్లు రాగా.. చాముండేశ్వరినాథ్‌కు కేవలం 9 ఓట్లే వచ్చాయి. మరోవైపు, కార్యదర్శిగా మల్లారెడ్డి గెలుపొందారు. ఈ పోటీలో మల్లారెడ్డికి 40 ఓట్లు రాగా.. బాబూరావుకు 12 ఓట్లు వచ్చాయి.
కాగా, జితేందర్ రెడ్డి 1954, జూన్ 26న రామచంద్రారెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా, మానవపాడ్ మండలంపెద్ద ఆముద్యాలపాడు గ్రామంలో జన్మించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.కాం చదివారు.
1981, డిసెంబరు 19న రాజేశ్వరి రెడ్డితో వివాహం జరిగింది. వీరికి
ముగ్గురు పిల్లలు.
వ్యాపార రంగంలో విజయం సాధించిన జితేందర్ రెడ్డి 1999లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 13వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.
1999-2000 మధ్యకాలంలో 2010లో తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్ బ్యూరో సభ్యులు నియమించబడ్డారు. 2014, మేలో 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014, జూన్ 13 నుంచి సభా కార్యక్రమాల సలహా సంఘం సభ్యులుగా ఉన్నారు.
2014, సెప్టెంబరు 15న పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో ఫుడ్ మేనేజ్మెంట్ జాయింట్ కమిటీ చైర పర్సన్ నియమించబడ్డారు. పార్లమెంట్ లోకల్ ఏరియా డెవెలప్మెంట్ పథకాల కమిటీ సభ్యులుగా ఉన్నారు. 2014, సెప్టెంబరు 19 నుంచి స్టాండింగ్ రక్షణ కమిటీ సభ్యులుగా నియమించబడ్డారు.
సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యులుగా ఉన్నారు. 2015, జనవరి 29 నుంచి జనరల్ పర్పసెస్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. 2016, జూన్ 2 రక్షణ స్టాండింగ్ కమిటీ సబ్ కమిటీ సభ్యులుగా నియమించబడ్డారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications