మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర సీఎం కేసీఆర్ డ్రామానే: ఆల్ పార్టీ జితేందర్ రెడ్డి అంటూ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా, ఆరోపణలపై బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రలో తన హస్తం ఉందంటూ టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని జితేందర్ రెడ్డి ఖండించారు.

మచ్చలేని జీవితంపై విపరీత ఆరోపణలా: జితేందర్ రెడ్డి
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో జితేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వానికి సీబీఐపై నమ్మకం లేకపోతే న్యాయ విచారణ జరిపించాలన్నారు. ఎలాంటి మచ్చ లేని తనపై విపరీత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పరిణామాలపై ఢిల్లీ నాయకత్వానికి వివరిస్తున్నట్లు తెలిపారు. మంత్రిపై హత్య కుట్ర ఎందుకు జరిగిందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. విచారణ నిమిత్తం పోలీసులు వెళ్తే తప్పకుండా సహకరిస్తానని జితేందర్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ ఆడుతున్న పెద్ద డ్రామా..: జితేందర్ రెడ్డి
తెలంగాణ ఉద్యమకారులతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని, ఉద్యమకారులకు వసతి కల్పించడం తన బాధ్యత అని అన్నారు. ఫిబ్రవరి 26న మున్నూరు రవి వచ్చాడని, తన పీఏ చెప్పాడన్నారు. రవితోపాటు ఢిల్లీకి ఎవరు వచ్చారో తనకు తెలియదన్నారు జితేందర్ రెడ్డి. తిరిగి 28న రవి వెళ్లిపోయాడు. మహబూబ్‌నగర్ నుంచి కార్యకర్తలు ఢిల్లీ వస్తే నా ఇంటికి వచ్చేవారు. మున్నూరు రవి ప్రతివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలుస్తారు. మున్నూరు రవిపై ఎక్కడ ఎలాంటి ఆరోపణలు లేవు. నా ఇళ్లపై దాడులు చేసిన వారిపై ఎలాంటి కేసులు పెట్టను. రెచ్చగొడితేనే వారు దాడి చేశారని అన్నారు జితేందర్ రెడ్డి. తాము హత్యలు చేసేవాళ్లం కాదని అన్నారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. తన ఇంటిపై దాడి చేస్తున్నా.. పోలీసులు చూస్తూ ఊరుకున్నారన్నారు. పోలీసులు సీఎం కేసీఆర్‌కు తొత్తులుగా మారిపోయారని విమర్శించారు. న్యాయంగా విధులు నిర్వర్తించాలని, తెలంగాణ చక్కని వాతావరణం నెలకొల్పాలని కోరుతున్నానని జితేందర్ రెడ్డి అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర అనేది సీఎం కేసీఆర్ ఆడుతున్న ఓ పెద్ద డ్రామా అని కొట్టిపారేశారు.

ఆల్ పార్టీ జితేందర్ అంటారు నన్ను..
బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ దూసుకుపోతోందని, ఆయన ఎక్కడ కాలు మోపితే అక్కడ విజయం వరిస్తుందన్నారు జితేందర్ రెడ్డి. అందుకే ఆయన త్వరలో చేపట్టబోయే రెండో విడత పాదయాత్రను ఆపడానికి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారన్నారు. దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల ఇంఛార్జీగా ఉండి.. బీజేపీని గెలిపించానని నమ్మిన పార్టీ తనకు మిషన్ 19 బాధ్యత అప్పగించిందన్నారు. అందుకే తనపై ఎలాగైనా బురద జల్లాలని కేసీఆర్ ఈ మర్డర్ డ్రామాకు తెరదీశారన్నారు. అందరితో సఖ్యతగా ఉంటానని, అందుకే తనను అందరూ ఆల్ పార్టీ జితేందర్ అంటారన్నారు. అలాంటి తనపై హత్యారోపణలు చేయడం సరికాదన్నారు.
Recommended Video

జితేందర్ రెడ్డి ఇంటిపై మరోసారి రాళ్లదాడి
కాగా, పథకం ప్రకారమే దుండగలు తన ఇంటిపై రాళ్లతో దాడి చేశారని, దాడిని ఆపాల్సిన పోలీసులు టీఆర్ఎస్ సర్కార్ కు తొత్తులుగా వ్యవహరించారని విమర్శించారు. కేసీఆర్ కు డబ్బు, అధికారం మీద దాహమే తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్టదన్నారు. తన డ్రైవర్ ఏ తప్పు చేయలేదని, అతడిపై పెట్టిన కేసును వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. మరోవైపు, మహబూబ్‌నగర్‌లో హైటెన్షన్ కంటిన్యూ అవుతోంది. జితేందర్ రెడ్డి ఇంటిపై మరోసారి దాడి జరిగింది. కొందరు వ్యక్తులు జితేందర్ రెడ్డి ఇంటి పై రాళ్లు విసిరారు. దీంతో కిటికీ అద్దాలు, డోర్లు ధ్వంసం అయ్యాయి. రోడ్డు పై నుంచి కొంతమంది రాళ్లు విసిరారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ను రిలీజ్ చేశారు జితేందర్ రెడ్డి ఇంటి సిబ్బంది. జితేందర్ రెడ్డి ఇంటిపై దాడిని బీజేపీ నేతలు ఖండించారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications