అమానుషం: ఓ వ్యక్తిని చితకబాది బూటు కాలితో తన్నిన ఎస్ఐ, కుప్పకూలాడు(వీడియో)

హైదరాబాద్: పోలీసు ఉన్నతాధికారులు ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ప్రజలకు దగ్గరవుదామని ప్రయత్నిస్తుంటే.. కింది స్థాయి అధికారులు మాత్రం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్లో భయాందోళనకు కారణమవుతున్నారు. తాజాగా, జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ వ్యక్తిని ఎస్ఐ బూటుకాలుతో తన్నుతూ అమానుషంగా వ్యవహరించాడు.

జోగులాంబ గద్వాల జిల్లాలో కర్నూలుకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తిని ఎస్‌ఐ చితకబాదాడు. అతని ముఖంపై బూటు కాలితో తన్నాడు రాజోలి ఎస్ఐ లెనిన్ బాబు. దీన్ని మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసిన స్థానికులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

 Jogulamba Gadwal: sub inspector Lenin Babu Beat-up a man and kicked with boots.

వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సరిహద్దుల్లో ఉన్న ఓ వైన్‌షాప్‌క్‌కి మందు మందుబాబులు భారీగా తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు మద్యం సేవిస్తూ కనిపించాడు లక్ష్మణ్‌.

బ్రీత్ అనలైజర్ టెస్ట్‌ చేస్తున్న సమయంలో లక్ష్మణ్ అనే యువకుడు ఎస్‌ఐతో గొడవ పడ్డాడు. అంతేగాక, వెహికల్‌పై రాళ్లతో దాడిచేసినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో ఊగిపోయిన డ్యూటీ ఎస్‌ఐ రెచ్చిపోయాడు. లక్ష్మణ్‌ను చితకబాదడంతో పాటు బూటు కాలితో ముఖంపై తన్నడంతో అక్కడిక్కడే కుప్పకూలాడు. దీంతో అతన్ని వదిలేసిన పోలీసులు మరొకరిని చావబాదారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి గురించిన ఆరోగ్యపరిస్థితి గురించి తెలియాల్సి ఉంది.

Recommended Video

    IPL 2021 : Who Is Venkatesh Rajasekaran Iyer, KKR's Latest Debutant ? || Oneindia Telugu

    కాగా, బూటుకాలితో తన్నుతుండగా.. అక్కడేవున్న ఒకరు మొబైల్ ఫోన్లో వీడియో తీశారు. అతడ్ని కూడా ఎస్ఐ బెరించినట్లుగా తెలుస్తోంది.ఇలాంటి అమానుష దాడులకు పాల్పడుతున్న పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్ధానికులు కోరుతున్నారు. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి జిల్లా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే, పోలీసులు తమ వాహన అద్దాలు పగలగొట్టుకుని బాధితుడిపై దాడి చేశారని స్థానికంగా కొందరు చెబుతుుండటం గమనార్హం. ఏది ఏమైనా ఓ వ్యక్తిని అంత దారుణంగా కొట్టడం ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వెంటనే సదరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+