Biological E: జాన్సన్ అండ్ జాన్సన్ కోవిడ్ వ్యాక్సిన్‌పై హైదరాబాదీ ఫార్మా కంపెనీ వర్కవుట్

హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన మరో టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ బయోలాజికల్ ఈ నుంచి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఫార్మా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేస్తోన్న కోవిడ్ వ్యాక్సిన్‌ను హైదరాబాదీ కంపెనీ ఉత్పత్తి చేయనుంది. ఈ మేరకు ఈ రెండు కంపెనీల మధ్య త్వరలోనే ఓ ఒప్పందం కుదరబోతోంది. ఈ విషయాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ ధృవీకరించింది. కోవిడ్ వ్యాక్సిన్‌పై తాము బయోలాజికల్ ఈ తో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ల తయారీకి హైదరాబాద్ క్రమంగా గ్లోబల్ హబ్‌గా ఆవిర్భవించేలా కనిపిస్తోంది. ఇప్పటికే రెండు వ్యాక్సిన్లు హైదరాబాద్‌లో ఉత్పత్తి అవుతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)తో కలిసి భారత్ బయోటెక్.. కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసింది. ఆ సంస్థే దాన్ని ఉత్పత్తి చేస్తోంది. కోవాగ్జిన్‌ టీకాను దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వినియోగిస్తోన్న విషయం తెలిసిందే. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కే చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ తయారు చేస్తోంది. త్వరలో- దీన్ని వ్యాక్పినేషన్ కార్యక్రమంలో చేర్చనుంది కేంద్ర ప్రభుత్వం.

Johnson and Johnson is working with Hyderabad based Biological E on Covid19 vaccine

తాజాగా- హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న టాప్ ఫార్మా కంపెనీ బయోలాజికల్ ఈ కూడా వ్యాక్సిన్ ఉత్పత్తికి చేయడానికి ముందుకొచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్‌తో చేతులు కలిపింది. జాన్సన్ అండ్ జాన్సన్.. ఇదివరకే కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఆ కంపెనీకి చెందిన జాన్సన్ కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఒప్పందాన్ని త్వరలోనే కుదుర్చుకోబోతోంది. ప్రతి సంవత్సరం 60 కోట్ల జాన్సన్ కోవిడ్ వ్యాక్సిన్‌ డోసులను తయారు చేయడానికి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకోనున్నట్లు జే అండ్ జే తెలిపింది.

Johnson and Johnson is working with Hyderabad based Biological E on Covid19 vaccine

జాన్సన్ అండ్ జాన్సన్ తాను అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌ను చేపట్టడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కిందటి నెల భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్‌కు ప్రతిపాదనలను పంపించింది. ఇవి ఇంకా పరిశీలన దశలో ఉన్నాయి. త్వరలోనే ఆ ప్రతిపాదనలపై డీసీజీఐ ఆమోదముద్ర వేస్తుందని తెలుస్తోంది. మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ఆరంభమైన వెంటనే.. బయోలాజికల్ ఈ తో కలిసి ఈ టీకాను ఉత్పత్తి చేస్తుందని సమాచారం. క్లినికల్ ట్రయల్స్ పూర్తియన వెంటనే- ఈ టీకాను కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమంలోకి చేర్చే అవకాశాలు లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+