జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కీలక అప్‌డేట్..!

రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రేపు, అక్టోబర్ 13, 2025న ఉప ఎన్నికకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.

ఎన్నికల అధికారులు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, అక్టోబర్ 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు (ప్రభుత్వ సెలవు దినాలు మినహా) నామినేషన్లు స్వీకరించబడతాయి. అభ్యర్థులు ప్రతి రోజు ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు.

Jubilee Hills By-Election Notification Tomorrow Nominations Open Till Oct 21 Full Guidelines

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్‌ఓ) కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, షేక్‌పేట్‌లో నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు పాటించాల్సిన కీలక నిబంధనలు ఇవే.Form 2B (నామినేషన్), అన్ని కాలమ్‌లు నింపి నోటరైజ్ చేయబడిన Form 26 (అఫిడవిట్) సమర్పించడం తప్పనిసరి. అభ్యర్థికి కనీస వయస్సు 25 ఏళ్లు ఉండాలి.

గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులకు ఒక్క ప్రతిపాదకుడు (నియోజకవర్గ ఓటరు) సరిపోతారు. స్వతంత్ర అభ్యర్థులు లేదా గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులు మాత్రం పది మంది ప్రతిపాదకులను సమర్పించాల్సి ఉంటుంది.

అభ్యర్థులు ఈసీఐ (ECI) యొక్క ENCORE పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో నామినేషన్ ఫారం నింపవచ్చు. అయితే, క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రింటెడ్ హార్డ్ కాపీని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో తప్పనిసరిగా సమర్పించాలి.

నామినేషన్ దాఖలు సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. అలాగే, అభ్యర్థితో సహా గరిష్టంగా 5 మంది వ్యక్తులు మాత్రమే కార్యాలయంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది.

అర్హత కలిగిన అభ్యర్థులు నిబంధనలు పాటిస్తూ, సకాలంలో నామినేషన్లు దాఖలు చేయాలని రిటర్నింగ్ అధికారి పి సాయిరాం కోరారు. జూబ్లీహిల్స్ బైపోల్ రాజకీయ సమీకరణాలను ఎలా మారుస్తుందో అనే ఉత్కంఠ ప్రస్తుతం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+