జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఈసీ తాజా ఆదేశాలు: వేడెక్కిన రాజకీయాలు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నిర్వహణకపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేస్తోంది. అక్టోబర్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో- ఓటర్ల జాబితా పునః సమీక్ష, మార్పులు- చేర్పులు, ఓటింగ్ ప్రక్రియ, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు వంటి చర్యలపై దృష్టి సారించింది. నవంబర్ లో అక్టోబర్ చివరివారం/నవంబర్ లో పోలింగ్ నిర్వహించే అవకాశాలు లేకపోలేదు.

భారత్ రాష్ట్ర సమితికి చెందిన శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్నుమూత వల్ల ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఖాళీ అయిన ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి మూడు పార్టీలు రంగంలోకి దిగాయి. దీన్ని నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్, తమ ఖాతాలో వేసుకోవడానికి అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంది.

Jubilee Hills bypoll EC has issued the schedule for the Special Summary Revision of Electoral Rolls

ఈ పరిస్థితుల మధ్య తాజాగా ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై కసరత్తు పూర్తి చేస్తోంది. దీనికి సంబంధించిన తేదీలను వెల్లడించింది. పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ ప్రక్రియ కిందటి నెల 28వ తేదీన ఆరంభమైంది. త్వరలో దీన్ని పూర్తి చేయనుంది. మంగళవారం నాడు ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురింది.

కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్ సైట్ లో ఈ ఓటర్ల జాబితా అందుబాటులోకి వచ్చింది. ఈ జాబితాకు సంబంధించి అభ్యంతరాలు, ఫిర్యాదులను ఏవైనా ఉంటే ఈ నెల 17వ తేదీ వరకు స్వీకరిస్తారు. స్వీకరించిన అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారం ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తవుతుంది.

చివరిగా- తుది ఓటర్ల జాబితాను ఈ నెల 30వ తేదీన ప్రచురించనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,04,288 మంది పురుషులు కాగా, 1,88,356 మంది మహిళలు. ఇతరుల కేటగిరీలో 25 మంది ఓటర్లు నమోదయ్యారు. నియోజకవర్గంలో 407 పోలింగ్ స్టేషన్లు 139 వేర్వేరు భవనాల్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఇది పూర్తయిన తర్వాత షెడ్యూల్ వెలువడుతుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే దీన్నీ నిర్వహించనుంది ఈసీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+